📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

NCERT: 9వ తరగతి సిలబస్ మార్పుపై సలహాలు, సూచనలు చేయండి

Author Icon By Tejaswini Y
Updated: March 18, 2026 • 11:12 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

2026-27 విద్యా సంవత్సరం నుంచి 9వ తరగతి సిలబస్లో మార్పులు చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే సిలబస్ లో చేసిన మార్పులను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు జాతీయ విద్యా పరిశోధన, శిక్షణా మండలి(NCERT) తెలిపింది. ఈ మార్పులపై ఉపాధ్యాయులు తమ సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరింది. జాతీయ విద్యా విధానం (ఎస్ఈపీ) 2020కి కొనసాగింపుగా, జాతీయ పాఠశాల విద్యా పాఠ్యప్రణాళిక (ఎన్సీఎఫ్-ఎస్ఈ) 2023 సిఫార్సులకు అనుగుణంగా, ఎన్సీఈఆర్టీ కొత్త పాఠ్యపుస్తకాల అభివృద్ధిని చేపట్టింది.

Read Also: Southwest Monsoon: ఈ యేడాది అనావృష్టి ఎల్నినోతో నైరుతిపై ప్రతికూలం

NCERT: Make suggestions and recommendations on the change in the 9th class syllabus

అందులో భాగంగా ఇప్పటికే1 నుండి 8వ తరగతి వరకు కొత్త ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాలు రూపొందించబడ్డాయని, ఇప్పటికే ముద్రణ కూడా పూర్తయిందని తెలిపింది. కొత్త పుస్తకాలు ముద్రించబడి డిజిటల్ రూపాల్లో అందుబాటులో ఉన్నాయని తెలిపింది. 95 తరగతికి సంబంధించిన కొత్త పాఠ్యపుస్తకాలు అభివృద్ధి దశలో ఉన్నాయని 2026-27 విద్యా సంవత్సరం నుండి ఉపయోగం కోసం అందుబాటులోకి తీసుకురానున్నట్టు ప్రకటించింది.

ఈ నేపథ్యంలో ఎన్సీఎఫ్-ఎస్ఈ 2023 సిఫార్సుల ఆధారంగా రూపొందించిన 9వ తరగతి ముసాయిదా సిలబస్ ను, సూచనలు, సలహాల సేకరణ కోసం ఎన్సీఈఆర్టీ అధికారిక వెబ్ సైట్లో అందుబాటులో ఉంచినట్టు ఎన్సీఈఆర్టీ కార్యదర్శి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కొత్త సిలబస్, పాఠ్యపుస్తకాలను ప్రారంభించే ముందు, విద్యార్థుల ప్రాథమిక అభ్యసన అవసరాలు తగినంతగా తీరేలా చూసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. 10వ తరగతి, 11వ తరగతులకు కొత్త పాఠ్యపుస్తకాలు 2027 -28 విద్యా సంవత్సరం నుండి ప్రవేశపెట్టబడతాయని ప్రకటించారు. 2026-27 విద్యా సంవత్సరంలో 10వ, 11వ తరగతులకు అన్ని సబ్జెక్టులు ప్రస్తుతం ఉన్న పాఠ్యపుస్తకాలనే ఉపయోగించడం జరుగుతుందని ప్రకటనలో స్పష్టం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

CBSE Curriculum Update Class 9 New Textbooks education news India National Education Policy 2020 NCERT New Syllabus 2026 NCF-SE 2023

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.