📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Ahmedabad-Gorakhpur Express : దారుణానికి ఒడిగట్టిన TTE ..ప్రయాణికురాలిపై అత్యాచారం

Author Icon By Sudheer
Updated: February 17, 2026 • 11:11 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అహ్మదాబాద్-గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్‌లో ప్రయాణికురాలిపై టీటీఈ (TTE) అఘాయిత్యానికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. రక్షణ కల్పించాల్సిన రైల్వే అధికారియే భక్షకుడిగా మారిన ఘటన అహ్మదాబాద్-గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్‌లో చోటుచేసుకుంది. ఎన్సీసీ (NCC) క్యాడెట్ పరీక్ష రాసి తిరిగి వెళ్తున్న ఒక యువతి, రైలులో విపరీతమైన రద్దీ ఉండటంతో సాధారణ టికెట్ తీసుకోకుండానే ఏసీ కోచ్‌లోకి ప్రవేశించింది. రైలులో టికెట్లు తనిఖీ చేస్తున్న టీటీఈ రాహుల్, ఆమె పరిస్థితిని గమనించాడు. జనరల్ టికెట్ లేదని భయపెట్టకుండా, ఆమెకు సీటు ఇప్పిస్తానంటూ నమ్మబలికి తన క్యాబిన్‌లోకి తీసుకెళ్లాడు. అక్కడ ఒంటరిగా ఉన్న ఆమెపై పాశవికంగా అత్యాచారానికి ఒడిగట్టాడు.

Bengaluru : వాష్ రూమ్ లో ఉన్న హీరోయిన్ను వీడియో తీసి బ్లాక్మెయిల్

నిందితుడి చెర నుంచి తప్పించుకున్న బాధితురాలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా అత్యవసర సహాయం కోసం 112 నంబర్‌కు డయల్ చేసి ఫిర్యాదు చేసింది. రైలు డియోరియా స్టేషన్‌కు చేరుకోగానే పోలీసులకు పట్టుబడతాననే భయంతో నిందితుడు రాహుల్ అక్కడికక్కడే రైలు దిగి పరారయ్యాడు. పోలీసులు రైలు వద్దకు చేరుకునేలోపే నిందితుడు తప్పించుకోవడంతో, బాధితురాలి స్టేట్‌మెంట్ ఆధారంగా రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. మహిళలపై ఇలాంటి దారుణాలు రైళ్లలో కూడా జరుగుతుండటం ప్రయాణికుల భద్రతపై తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

ప్రస్తుతం రైల్వే పోలీసులు నిందితుడైన టీటీఈ రాహుల్‌ కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. విధి నిర్వహణలో ఉండి, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి నీచానికి పాల్పడటంపై రైల్వే శాఖ సీరియస్ అయింది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అతడిని వెంటనే అరెస్టు చేయాలని బాధితురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన రైల్వే వ్యవస్థలో మహిళల భద్రత కోసం మరిన్ని కఠినమైన నిబంధనలు అమలు చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

.

Ahmedabad-Gorakhpur Express Google News in Telugu NCC cadet accuses TTE of rape TTE

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.