Gig Workers Strike: సోమవారం గిగ్ వర్కర్లు దేశవ్యాప్తంగా సమ్మెకు దిగడంతో ఆన్‌లైన్ డెలివరీ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడే పరిస్థితి నెలకొంది. మెరుగైన వేతనాలు, న్యాయమైన పని పరిస్థితులు కల్పించాలంటూ గిగ్ వర్కర్ల యూనియన్లు ఈ సమ్మెకు పిలుపునిచ్చాయి. సమ్మెలో భాగంగా స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్ వంటి ప్రముఖ డెలివరీ యాప్‌ల నుంచి లాగౌట్ అవుతూ సేవలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు యూనియన్ నాయకులు ప్రకటించారు.
Read Also: Padma Sri Awards 2026: తెలుగు రాష్ట్రాల్లో పద్మశ్రీలు అందుకున్న వారు వీరే
ఈ సమ్మెకు ప్రధాన కారణంగా గిగ్ వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలను యూనియన్ వివరించింది. తగిన వేతనాలు లేకపోవడం, ఇన్సెంటివ్స్ తగ్గించడం, హెల్త్ ఇన్సూరెన్స్ మరియు ప్రమాద బీమా లేకపోవడం వల్ల వర్కర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. అదనంగా పీఎఫ్, ఈఎస్‌ఐసీ, పెన్షన్ వంటి సామాజిక భద్రతా పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే 10 నిమిషాల్లో డెలివరీ చేయాలనే మోడల్ వల్ల రోడ్డు ప్రమాదాల ముప్పు పెరుగుతోందని, ఈ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని కోరారు.
Gig Workers Strike: Gig workers nationwide strike today
అన్యాయంగా ఐడీలను బ్లాక్ చేయడం, కారణం లేకుండా అకౌంట్లను నిలిపివేయడం వల్ల వర్కర్ల ఉపాధి ప్రమాదంలో పడుతోందని యూనియన్ ఆవేదన వ్యక్తం చేసింది. కొన్నిచోట్ల పోలీసుల వేధింపులు కూడా ఎదురవుతున్నాయని పేర్కొంటూ, వాటికి ముగింపు పలకాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలపై ప్రభుత్వం మరియు యాప్ కంపెనీలు వెంటనే స్పందించి చర్చలకు రావాలని కోరారు.
గిగ్ వర్కర్ల సమ్మె కారణంగా పలు నగరాల్లో ఆహార, నిత్యావసర డెలివరీలు నిలిచిపోయే అవకాశం ఉందని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు సమ్మె కొనసాగుతుందని యూనియన్ స్పష్టం చేసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: