📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం

Latest News: Rahul Gandhi: నేషనల్ హెరాల్డ్ కేసు.. రాహుల్, సోనియాలకు ఊరట

Author Icon By Anusha
Updated: December 16, 2025 • 12:45 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఊరట లభించింది. ఈడీ దాఖలు చేసిన మనీలాండరింగ్ ఫిర్యాదు, ఛార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకోవడానికి ఢిల్లీ కోర్టు నిరాకరించింది. మేజిస్ట్రేట్ కోర్టు ఉత్తర్వులను రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగ్నే రద్దు చేశారు. దీంతో నేషనల్ హెరాల్డ్ కేసులో మనీలాండరింగ్ జరిగిందంటూ వాదిస్తున్న ఈడీకి షాక్ తగిలినట్లయింది.

Read Also: PLFS: దేశంలో నిరుద్యోగ రేటు తగ్గుదల

కేసు నమోదు

నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ (Rahul Gandhi) తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలపై ఈడీ ఇప్పటికే మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. దీనిపై విచారణ జరిపేందుకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. ఈడీ నమోదు చేసిన కేసు చూస్తుంటే ఓ ప్రైవేటు వ్యక్తి చేసిందని అర్ధమవుతోందని, ఎఫ్ఐఆర్ ఆధారంగా నమోదు చేసిందని కాదని తెలుస్తోందని ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగ్నే తెలిపారు.

National Herald case.. relief for Rahul and Sonia

కాబట్టి మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన ఫిర్యాదుపై విచారణ కొనసాగించలేమని తేల్చేశారు.ఈ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ (Rahul Gandhi) లతో పాటు సుమన్ దూబే, శామ్ పిట్రోడా, యంగ్ ఇండియన్, డోటెక్స్ మర్చండైజ్ , సునీల్ భండారీలను కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నిందితులుగా చేర్చింది. వీరిపైనే ఢిల్లీ పోలీసు శాఖకు చెందిన ఆర్ధిక నేరాల విభాగం కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతోంది. ఈ నేపథ్యంలో మాజీ బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈడీ కేసు నమోదుచేయడం చెల్లదని ఢిల్లీ కోర్టు తేల్చేసింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Enforcement Directorate latest news national herald case rahul gandhi sonia gandhi Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.