నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు ఇతరులపై రౌస్ అవెన్యూ ట్రయల్ కోర్టులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) చార్జిషీట్ దాఖలు చేసింది. అయితే, ప్రైవేటు వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పీఎంఎల్ఏ (PMLA) కింద చర్యలు తీసుకోవడం సాధ్యం కాదని కోర్టు అభిప్రాయపడింది. అదేవిధంగా కేసులో వేసిన ఛార్జీషీటు కూడా చట్టపరంగా నిలవదని డిసెంబర్ 16న న్యాయమూర్తి ఆ పిటిషన్ ను, డిస్మిస్ చేశారు. ఈ క్రమంలోనే ఇవాళ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఈడీ (ED) అధికారులు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Read Also: Central Govt: స్మార్ట్‌ఫోన్ యూజర్స్ ను హెచ్చరించిన కేంద్రం
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: