National Deworming Day: చిన్నారులకు ఆల్బెండజోల్ మాత్రలు తప్పనిసరి:జేసీ ఆదేశం

Read Time:  1 min
National Deworming Day: చిన్నారులకు ఆల్బెండజోల్ మాత్రలు తప్పనిసరి:జేసీ ఆదేశం
FONT SIZE
GET APP

National Deworming Day: జిల్లాలో 1-19 సంవత్సరాల వయసు గల చిన్నారులందరికీ నులిపురుగుల నివారణ మాత్రలను తప్పకుండా అందించాలని జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ఈ నెల 17న జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ పై మంగళవారం జాయింట్ కలెక్టర్ వారి చాంబర్లో వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు.

Read Also: Collector Himanshu Shukla: ప్రభుత్వ బ్యాంక్ ఖాతాలపై కలెక్టర్ సమీక్ష

వయసు వారీగా మాత్రల పంపిణీ విధానం

ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, ఈనెల 17న మంగళవారం జిల్లావ్యాప్తంగా 1-19 సంవత్సరాల వయసు గల బాలబాలికలకు నులిపురుగుల నివారణ కోసం ఆల్బెండజోల్ మాత్రలను అందించనున్నట్లు చెప్పారు. మాత్రలు వేసే విధానంపై ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు:

  • 1 నుండి 2 ఏళ్లలోపు: సగం మాత్ర పొడిచేసి నీళ్లలో కలిపి అందించాలి.
  • 2 నుంచి 3 ఏళ్ల లోపు: ఒక మాత్ర పొడిచేసి నీళ్లలో కలిపి అందించాలి.
  • 4 నుంచి 19 ఏళ్ల లోపు: ఒక మాత్రను నేరుగా నమిలి మింగించాలి. వైద్య సిబ్బంది పర్యవేక్షణలోనే ఈ మాత్రలు తీసుకునేలా చూడాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ మాత్రలను ఇంటికి ఇవ్వరాదని జేసీ కచ్చితంగా ఆదేశించారు.
National Deworming Day
National Deworming Day: Albendazole tablets mandatory for children: JC orders

National Deworming Day: పంపిణీ కేంద్రాలు మరియు తదుపరి ప్రణాళిక

జిల్లాలోని అంగన్వాడి కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ఈ మాత్రలను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అందజేసేలా ఏర్పాట్లు చేసినట్లు జేసీ వివరించారు. ఈనెల 17న వివిధ కారణాల వల్ల మాత్రలు తీసుకోని వారికి, తిరిగి ఈనెల 24న మాత్రలను అందజేస్తామని చెప్పారు. చిన్నారుల మెరుగైన ఆరోగ్య సంరక్షణ మరియు ఎదుగుదల కోసం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సహకరించి, వైద్యారోగ్య శాఖ సిబ్బంది సూచనల మేరకు మాత్రలు వేయించాలని పిలుపునిచ్చారు.

సమావేశంలో పాల్గొన్న అధికారులు

ఈ సమీక్షా సమావేశంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ సుజాత, జిల్లా ఇమ్యూనికేషన్ అధికారి డాక్టర్ ఉమామహేశ్వరి, ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ యశ్వంత్, సమగ్ర శిక్ష ఏపీసి వెంకటసుబ్బయ్య, ఆర్ ఐ ఓ వరప్రసాద్, ప్రోగ్రాం మేనేజర్ జమీల్ తదితరులు పాల్గొన్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Siva Prasad

రచయిత గురించి

Siva Prasad

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.