National Broadcasting Day : ప్రతి సంవత్సరం జూలై 23న భారత్‌లో జాతీయ ప్రసార దినోత్సవం (National Broadcasting Day)ను నిర్వహిస్తారు. భారతదేశంలో రేడియో ప్రసారాలకు నాంది పలికిన రోజును గుర్తు చేసుకుంటూ ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. 1927 జూలై 23న బాంబే (ప్రస్తుత ముంబై) కేంద్రంగా ఇండియన్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ (IBC) తొలి రేడియో ప్రసారాన్ని ప్రారంభించింది.
Read Also : రేపు తెలంగాణ బంద్ కు నిరుద్యోగ JAC పిలుపు
భారత ప్రసార రంగ చరిత్రలో :
అదే భారత ప్రసార రంగ చరిత్రలో కీలక మలుపుగా నిలిచింది. రేడియో ప్రారంభమైన నాటి నుంచి దేశంలో సమాచార ప్రసారం, విద్య, వినోదం, వ్యవసాయ సలహాలు, ఆరోగ్య అవగాహన వంటి అనేక రంగాల్లో విశేష సేవలు అందిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు తాజా సమాచారం చేరవేయడంలో ఆకాశవాణి కీలక పాత్ర పోషించింది.
అనంతరం దూరదర్శన్ ప్రారంభం కావడంతో టెలివిజన్ ప్రసారాలు విస్తరించి దేశవ్యాప్తంగా వార్తలు, విద్యా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలకు చేరువయ్యాయి. ప్రస్తుతం డిజిటల్ యుగంలో రేడియో, టెలివిజన్‌తో పాటు ఆన్‌లైన్ న్యూస్ పోర్టల్స్, ఎఫ్‌ఎమ్ రేడియోలు, వెబ్‌కాస్టింగ్, పోడ్‌కాస్ట్స్ వంటి ఆధునిక ప్రసార మాధ్యమాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి.
సాంకేతికత మారినా ప్రజలకు నమ్మకమైన సమాచారాన్ని వేగంగా అందించడం ప్రసార మాధ్యమాల ప్రధాన బాధ్యతగానే కొనసాగుతోంది. జాతీయ ప్రసార దినోత్సవం సందర్భంగా ప్రసార రంగంలో విశేష సేవలు అందించిన జర్నలిస్టులు, సాంకేతిక నిపుణులు, వ్యాఖ్యాతలను స్మరించుకుంటారు. సమాజానికి విశ్వసనీయ సమాచారం అందించడంలో ప్రసార మాధ్యమాల పాత్రను గుర్తు చేస్తూ ఈ దినోత్సవం ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :