📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం

Latest News: HYD: హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్

Author Icon By Anusha
Updated: December 18, 2025 • 12:03 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ (HYD) నగరంలోని పుస్తక ప్రియులకు ఇది నిజంగా శుభవార్త. ప్రతి ఏడాది సాహితీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే హైదరాబాద్ (HYD) నేషనల్ బుక్ ఫెయిర్ ఈసారి మరింత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 38వ ఎడిషన్‌గా జరగనున్న ఈ పుస్తకాల పండుగ ఈ నెల డిసెంబర్ 19 నుంచి 29 వరకు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం (NTR Stadium) వేదికగా జరుగనుంది.ఈ పుస్తకాల జాతరకు సంబంధించిన వివరాలను బుక్ ఫెయిర్ అధ్యక్షుడు యాకూబ్ షేక్, సెక్రటరీ ఆర్. వాసు వెల్లడించారు.

Read Also: Telangana: సర్పంచ్ ఎన్నికల్లో ‘జగన్ పై చంద్రబాబు’ విజయం!

ఈ ఏడాది బుక్ ఫెయిర్ ప్రాంగణానికి ప్రకృతి కవి అందెశ్రీ పేరును నామకరణం చేయడం విశేషం.ప్రతిరోజూ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 9 గంటల వరకు బుక్ ఫెయిర్‌లో సందర్శకులకు ప్రవేశం ఉంటుంది. గతేడాది 10 లక్షల మంది సందర్శించగా.. ఈసారి సుమారు 12 నుంచి 15 లక్షల మంది వస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.

ఇందుకు తగ్గట్టుగా మొత్తం 365 స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. సామాన్య ప్రజలకు ప్రవేశ రుసుము రూ.10 కాగా.. విద్యార్థులకు, వారితో వచ్చే ఉపాధ్యాయులకు ఐడీ కార్డులు చూపిస్తే ఉచిత ప్రవేశం కల్పించనున్నారు.ఈ పది రోజుల్లో సుమారు 50 కొత్త పుస్తకాలు ఈ వేదికల మీద నుంచి ఆవిష్కరించనున్నారు.

National Book Fair in Hyderabad

చిన్నారుల కోసం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు

ప్రముఖ రచయితలతో ముఖాముఖి కార్యక్రమాలు, వారిని ప్రభావితం చేసిన పుస్తకాలపై చర్చలు పాఠకులకు కొత్త అనుభూతిని ఇవ్వనున్నాయి.పుస్తక పఠనంతో పాటు తెలంగాణ రుచులను ఆస్వాదించేందుకు నాణ్యమైన ఆహారంతో ఫుడ్ కోర్టులను సిద్ధం చేశారు. పిల్లల కోసం ‘కిడ్స్ ప్లే ఏరియా’, తల్లిదండ్రులు కూర్చోవడానికి సిట్టింగ్ గ్యాలరీలు కూడా ఉన్నాయి.కేవలం పుస్తకాలే కాకుండా..

ప్రతిరోజూ మధ్యాహ్నం 1 నుంచి 4 గంటల వరకు బాలోత్సవ్ పేరుతో చిన్నారుల కోసం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.నేటి తరం ఎదుర్కొంటున్న సమస్యలైన డ్రగ్స్ నివారణ, మొబైల్ ఫోన్ అతిగా వాడటం వల్ల కలిగే నష్టాలు, సైబర్ నేరాలపై అవగాహన కల్పించడానికి ప్రత్యేకంగా స్కిట్స్ ప్రదర్శించనున్నారు. 38 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ హైదరాబాద్ బుక్ ఫెయిర్‌ను జయప్రదం చేయాలని, సాహితీ ప్రియులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని నిర్వాహకులు కోరుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Hyderabad book fair 2024 Hyderabad National Book Fair latest news National Book Fair Hyderabad dates NTR Stadium Hyderabad Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.