దేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ (Narendra Modi) ఈనెల 23 నుంచి 26వరకు బ్రిటన్, మాల్దీవుల్లో
పర్యటించనున్నట్లు (visiting the Maldives) అధికార వర్గాలు వెల్లడించాయి. భారత్-బ్రిటన్ వాణిజ్య ఒప్పందంపై జరిగే చర్చల్లో మోదీ పాల్గొంటారు. అనంతరం ఒప్పందంపై సంతకం చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అంతేకాక యూకే ప్రభుత్వంతో దౌత్య, వాణిజ్య చర్చలు జరపనున్నారు. తర్వాత జులై 25, 26వ తేదీలలో మాల్దీవులలో మోదీ పర్యటిస్తారు. మాల్దీవుల 60వ జాతీయ దినోత్సవానికి ముఖ్య అతిథిగా మోదీ హాజరు కానున్నారు.

మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలతో:-
గత సంవత్సరం మోదీ (Narendra Modi)పై, లక్షవీపై పై మాల్దీవులు మంత్రులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో రెండు దేశాలమధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు (Diplomatic tensions) నెలకొన్న విషయం తెలిసిందే. సోషల్మీడియాలో మాల్దీవులపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అయ్యాయి. ‘బాయ్కాట్ మాల్దీవ్స్ ‘ పేరిట హ్యాష్యాగ్ ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. దీనిలో మాల్దీవులకు పర్యాటకుల సంఖ్య తగ్గింది. పర్యాటకరంగంపై ఆధారపడి మనుగడ సాగిస్తున్న మాల్దీవుల దేశానికి ఆర్థిక కష్టాలను ఎదుర్కొంది. అంతేకాక రెండుదేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు కూడా దెబ్బతిన్నాయి. ప్రస్తుతం మోదీ ఆదేశ పర్యటన ద్వారా మళ్లీ దౌత్యసంబంధాలు మెరుగుపడతాయని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాయి .
Read hindi news: hindi.vaartha.com
Read also: Ahmedabad Plane Crash: ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై అమెరికా బోర్డు అభిప్రాయం ఏంటి?