Narendra Modi speech : సిక్కులపై ద్వేషమా? కాంగ్రెస్‌పై మోదీ ఘాటు విమర్శలు!

Read Time:  1 min
Narendra Modi speech
Narendra Modi speech
FONT SIZE
GET APP

Narendra Modi speech : రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో మాట్లాడుతూ, సిక్కుల పట్ల కాంగ్రెస్ అగ్రనేత Rahul Gandhi వ్యాఖ్యలు ద్వేషాన్ని ప్రతిబింబిస్తున్నాయని అన్నారు. పార్లమెంట్ ప్రాంగణంలో ఎంపీ రవ్‌నీత్ బిట్టును అవమానించడం కాంగ్రెస్ అసలు స్వభావాన్ని బయటపెట్టిందని మండిపడ్డారు.

“మొహబ్బత్ కీ దుకాణం” అంటూ ప్రేమ, ఐక్యత గురించి మాట్లాడే కాంగ్రెస్ నాయకత్వం, వాస్తవానికి విభేదాలు సృష్టిస్తోందని మోదీ విమర్శించారు. సిక్కు సమాజానికి చెందిన ప్రజాప్రతినిధిని ద్రోహిగా ముద్రవేయడం సరికాదని, ఇది కాంగ్రెస్ అహంకారానికి నిదర్శనమని పేర్కొన్నారు.

Read Also: ICC T20 ranking list : ఐసీసీ ర్యాంకింగ్స్ షాక్, ఇషాన్ కిషన్ 32 స్థానాలు జంప్!

Narendra Modi speech
Narendra Modi speech

ఇక “గరీబీ హఠావో” కాంగ్రెస్‌కు కేవలం నినాదమే తప్ప అమలు చేయాలనే చిత్తశుద్ధి ఎప్పుడూ లేదని మోదీ అన్నారు. తమ ప్రభుత్వం మాత్రం పేదల సంక్షేమం కోసం పనిచేస్తోందని, దేశ ప్రజల విశ్వాసం ఎన్డీఏ ప్రభుత్వంపై పెరిగిందని స్పష్టం చేశారు. ప్రతీ విషయంలో విమర్శలు చేయడం తప్ప కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయ దృష్టి లేదని ఆయన వ్యాఖ్యానించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Sai Kiran

రచయిత గురించి

Sai Kiran

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.