Telugu news:Narendra Modi: బీహార్ ఎన్నికల వేడి: ఆర్జేడీపై మండిపడ్డ ప్రధాని మోదీ

Read Time:  1 min
Narendra Modi
Narendra Modi
FONT SIZE
GET APP

బీహార్‌లో మొదటి దశ ఎన్నికలు పూర్తవగా, రెండో దశ పోలింగ్ అక్టోబర్ 11న జరగనుంది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీల మధ్య ఘర్షణాత్మక వాతావరణం నెలకొంది. అధికార పక్షం, విపక్షం రెండూ ఓటర్లను ఆకర్షించేందుకు విస్తృతంగా ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. సీతామర్హిలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) పాల్గొని ఓటర్లను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.

Read Also: Bihar Elections: ఎన్డీఏ కి మద్దతుగా బీహార్ లో నారా లోకేష్ ప్రచారం

Narendra Modi
Narendra Modi

మేము ల్యాప్‌టాప్‌లు ఇస్తే వారు రివాల్వర్లు ఇస్తున్నారు” – మోదీ వ్యంగ్యం
ప్రచార సభలో మాట్లాడుతూ ప్రధాని మోదీ,(Narendra Modi) బీహార్ విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆర్జేడీపై(Rashtriya Janata Dal) తీవ్ర విమర్శలు గుప్పించారు. “మేము యువతకు ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, ఫుట్‌బాల్, హాకీ స్టిక్‌లు ఇస్తుంటే, వారు మాత్రం రివాల్వర్లు ఇవ్వాలని మాట్లాడుతున్నారు. ప్రజలు తుపాకులు పట్టే ప్రభుత్వాన్ని కోరుకోవడం లేదు” అని అన్నారు.

“జంగిల్‌రాజ్ పాలనలో అభివృద్ధి లేకుండా పోయింది”
ప్రధాని మోదీ మాట్లాడుతూ, “ఆర్జేడీ పాలనలో బీహార్‌లో ఒక్క పెద్ద ఆసుపత్రి, ఒక్క మెడికల్ కళాశాల కూడా స్థాపించలేదు. ఆ కాలం ప్రజలకు జంగిల్‌రాజ్‌గా గుర్తుండిపోయింది. కానీ సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని NDA ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బీహార్‌లో పెట్టుబడిదారుల నమ్మకం పెరిగింది” అని అన్నారు. మోదీ మాట్లాడుతూ, “మన సంస్కృతి, సంప్రదాయాలను అవమానించిన వారిని ప్రజలు ఈ ఎన్నికల్లో శిక్షిస్తారు. బీహార్ యువతకు మంచి భవిష్యత్తు కావాలి – తుపాకులు కాదు, టెక్నాలజీ కావాలి” అని పిలుపునిచ్చారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.