హైదరాబాద్ : దేశంలో ఎప్పటి నుంచే అమలు జరుగుతున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడవడానికి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని సిపిఐ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె నారాయణ(Narayana) విమర్శించారు. ఇప్పటి వరకు కొనసాగిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పేరును రద్దుచేసి దాని స్థానంలో జి రాం జీ కేంద్ర ప్రభుత్వం చేస్తుందని మండిపడ్డారు.
Read Also: TG Politics: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో KCR, హరీశ్‌కు నోటీసులు ఇవ్వనున్న సిట్?
హైదరాబాద్(Hyderabad) లోని సిపిఐ రాష్ట్ర కార్యాలయం మగ్దూమ్ భవన్లో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వల్లా నరసింహారెడ్డి అధ్యక్షతన సిపిఐ రాష్ట్ర సమితి సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి, ఆ సమావేశాల్లో నారాయణ మాట్లాడుతూ.. 40 శాతం నిధులు రాష్ట్రాలు ఖర్చు వేసే విధంగా కొత్త చట్టాన్ని తీసుకువచ్చి రాష్ట్రాలు భరించలేని విధంగా ఉపాధి హామీ పథకానికి కొత్త చట్టం తీసుకొచ్చారన్నారని విమర్శించారు. రూ.28 లక్షల కోట్ల రూపాయలను సంపన్న కుటుంబాలకు పారుబకాయల పేరుతో ఖర్చు చేశారని, పేదవారికి అన్యాయం చేస్తున్నారని తెలిపారు.
పార్లమెంటులో బిజెపి తమ అనుకూల బిల్లులు పాస్ చేయించుకుంటున్నారని మండినడానడరు. ట్రంపు వెనిజులా(Trump Venezuela) అధ్యక్షుడిని చంపుతానంటున్నాడని, అమెరికా టారీఫ్ పేరుతో పెంచుకుంటూ పోతున్న ట్రంపు అనుకూలంగా మోడీ వ్యవహరిస్తున్నారని అన్నారు. న్యూయార్క్ జరిగిన సంఘటన ట్రంప్ కు షాక్ ఇచ్చిందన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు రాష్ట్ర సమితి సమావేశంలో కార్యదర్శి నివేదికను ప్రవేశపెట్టారు. ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలు, ఇతర విషయాలపై సమావేశంలో చర్చించడం జరిగింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: