బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అలీనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రముఖ జానపద గాయని మైథిలీ ఠాకూర్ (Mythili Thakur) (25) విజయం సాధించారు. అతి చిన్న వయస్సులో ఆమె బీహార్ అసెంబ్లీకి ఎన్నికైన రికార్డు సృష్టించారు. అలీనగర్ నుంచి ఆమె తన సమీప ఆర్జేడీ అభ్యర్థి బినోద్ మిశ్రాపై 11,730 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.
Read Also: Akhilesh Yadav: మీ ఆటలు మావద్ద సాగవు: అఖిలేష్ యాదవ్
ఇప్పటివరకు బీజేపీ అడుగుపెట్టని అలీనగర్ నియోజకవర్గంలో గెలిచి.. సరికొత్త చరిత్రను లిఖించారు. సాంస్కృతిక పునరుజ్జీవం, మహిళా విద్య, ఉపాధి కల్పనే ప్రధాన ఎజెండాగా ఈ ఎన్నికల్లో ఆమె ప్రచారం సాగించారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన మైథిలీ ఠాకూర్.. ఆపై రైజింగ్ స్టార్ వంటి రియాలిటీ షోల ద్వారా నేషనల్ లెవెల్‌లో గుర్తింపు తెచ్చుకున్న
మైథిలీ ఠాకూర్.. తన సాంస్కృతిక వారసత్వాన్ని రాజకీయాలకు వారధిగా మలచుకున్నారు. మైథిలీ ఠాకూర్, ఆమె సోదరులు రిషవ్, అయచి కలిసి చేసిన జానపద గీతాలు, రామచరితమానస్ గానం టీవీలు, సోషల్ మీడియాల్లో కోట్లాది మంది అభిమానులను సంపాదించి పెట్టాయి. ఈ సాంస్కృతిక మూలాలే ఆమెకు రాజకీయాల్లో బలమైన పునాదిగా మారాయి.
తన గెలుపుపై మైథిలీ ఠాకూర్ స్పందిస్తూ,
తన గెలుపుపై మైథిలీ ఠాకూర్ (Mythili Thakur) స్పందిస్తూ, తనకు మాటలు రావడం లేదని అన్నారు. ఈ విజయం ప్రజలదేనని ఆమె పేర్కొన్నారు. అలీనగర్ నియోజకవర్గ ప్రజలు గెలిచినట్లుగా భావిస్తున్నానని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. బీజేపీ పట్ల ప్రజలు నమ్మకం ఉంచారని ఆమె తెలిపారు.
మైథిలీ ఠాకూర్‌తో పాటు పాతికేళ్ల వయస్సులో ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిలో సోను కుమార్ (గోహ్), నవీన్ కుమార్ (భట్నాహ), కుందన్ కుమార్ (షేక్‌పురా), శంబూబాబు (సుపాల్), రాజ్ కుమార్ సాదా (సిమ్రీ భక్తీయార్‌పూర్) ఉన్నారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 25 నుంచి 30 ఏళ్లు కలిగిన ఎమ్మెల్యేలు నలుగురు, 31-40 ఏళ్లు కలిగిన వారు 32 మంది, 41-50 ఏళ్ల వారు 83 మంది, 51-60 ఏళ్లు కలిగినవారు 65 మంది, 61-70 ఏళ్ల వారు 47 మంది, 71-80 ఏళ్లు కలిగిన వారు 10 మంది ఉన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేల సగటు వయస్సు 51 సంవత్సరాలుగా ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: