కర్ణాటకలోని మైసూరు నగరంలో(Mysore Explosion) తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. డిసెంబర్ 25 గురువారం రాత్రి అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో జరిగిన భారీ పేలుడులో ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఘటన సమాచారం అందగానే పోలీసులు, అత్యవసర సేవల సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
Read Also: Ranga Reddy: శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా
గాయపడినవారిని ఆసుపత్రికి తరలించిన అధికారులు
పేలుడు సంభవించిన వెంటనే స్థానికులు క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. పోలీసులు ప్రాథమిక విచారణలో గ్యాస్ సిలిండర్ పేలుడే ఈ ప్రమాదానికి కారణమై ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఈ ఘటనతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. నగర పోలీస్ కమిషనర్ సీమా లట్కర్, డీసీపీ కె.ఎస్. సుందర్ రాజ్ నేతృత్వంలో ఎఫ్‌ఎస్‌ఎల్ బృందం, యాంటీ సబోటేజ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ వంటి ప్రత్యేక బృందాలు సంఘటనా స్థలాన్ని పరిశీలించాయి. నజర్‌బార్డ్ పోలీసులు ఘటనకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు.
సంగీత కచేరీ సమయంలో ప్యాలెస్ గేటు వద్ద ప్రమాదం
ప్రమాదం(Mysore Explosion) జరిగిన సమయంలో మైసూరు ప్యాలెస్ ప్రాంగణంలో వాసుకి వైభవ్ సంగీత కచేరీ కొనసాగుతోంది. పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు హాజరైన సమయంలో జయమార్తాండ గేటు సమీపంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో రాణేబెన్నూర్‌కు చెందిన 34 ఏళ్ల కొట్రేష్ గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడు కెఎస్‌ఆర్‌టీసీ హవేరి డివిజన్‌లో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.
ఈ ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తిని సలీం (40)గా గుర్తించారు. అతడు ప్యాలెస్ గేటు వద్ద బెలూన్‌లకు హీలియం గ్యాస్ నింపి విక్రయించే వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: