📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం

Murali Naik: సరిహద్దులో పాక్ జరిపిన కాల్పుల్లో తెలుగు జవాన్ మృతి

Author Icon By Sharanya
Updated: May 9, 2025 • 1:35 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇటీవల భారత సైన్యం నిర్వహించిన “ఆపరేషన్ సిందూర్” (Operation Sindoor) పాకిస్థాన్ మూర్ఖత్వానికి గట్టి సమాధానంగా నిలిచింది. ఈ ఆపరేషన్‌లో పాక్ మద్దతుదారులైన తీవ్రవాదుల గుట్టురట్టు కావడంతో, దాయాది పాకిస్థాన్ వ‌క్ర‌బుద్ధితో భార‌త స‌రిహ‌ద్దు ప్రాంతాల‌పై క్షిప‌ణి, డ్రోన్ దాడుల‌కు పాల్ప‌డుతోంది. ఈ క్రమంలో జ‌మ్మూక‌శ్మీర్‌లో పాకిస్థాన్ జ‌రిపిన కాల్పుల్లో తెలుగు జ‌వాన్ వీర మ‌ర‌ణం పొందారు. మృతిచెందిన జ‌వాన్‌ను ముర‌ళీ నాయ‌క్‌గా గుర్తించారు.

Murali Naik

పాక్ కాల్పుల్లో మురళీ నాయక్ వీరమరణం

ఈ నేపథ్యంగా గురువారం రాత్రి జమ్మూకశ్మీర్‌(Jammu and Kashmir) సరిహద్దుల్లో పాకిస్తాన్ జరిపిన అప్రేరిత కాల్పుల్లో భారత సైన్యం బలగాలు ప్రతిదాడికి దిగాయి. ఎదురుకాల్పుల్లో అనేక మంది జవాన్లు గాయపడ్డారుఈ క్రమంలో వీర తెలుగు జవాన్ మురళీ నాయక్(Murali Nayak) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అతని మరణ వార్త ఆయన స్వగ్రామానికే కాకుండా, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తీవ్ర ఆవేదనను కలిగించింది.

మురళీ నాయక్‌ స్వస్థలం

మురళీ నాయక్ ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh) లోని సత్యసాయి జిల్లా, గోరంట్ల మండల పరిధిలోని కళ్ళితండా గ్రామానికి చెందినవారు. ఆయన సోమందేపల్లి మండలంలోని నాగినాయని చెరువుతండా గ్రామంలో బాల్యం గడిపారు. విద్యాభ్యాసం సోమందేపల్లిలోని విజ్ఞాన్ స్కూల్ లో పూర్తిచేశారు. చిన్ననాటి నుంచి దేశభక్తి భావనతో ఎదిగిన మురళీ నాయక్, దేశ రక్షణే తన లక్ష్యంగా భావించి భారత సైన్యంలో చేరారు.

కుటుంబంలో విషాద ఛాయలు

మురళీ నాయక్ మరణ వార్త విని ఆయన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. దీంతో స్వ‌గ్రామం క‌ల్లితండాలో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి. మురళీ నాయక్ పార్థివ దేహాన్ని శనివారం స్వగ్రామానికి తీసుకురానున్నారు. అక్కడ ఆయన అంత్యక్రియలు సైనిక గౌరవాలతో నిర్వహించనున్నారు.

Read also: India Pakistan War: మనదేశ క్షిపణులను పాకిస్తాన్ ఎందుకు కంట్రోల్ చేయలేకపోయింది?

#BorderAttack #indianarmy #MuraliNaik #NationSalutesYou #OperationSindoor #PakistanCeasefireViolation #TeluguSoldier Breaking News Today In Telugu Google News in Telugu India News Today in Telugu Latest News in Telugu Latest News today in Telugu News in Telugu Today Telugu News Today Today News In Telugu Today Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.