కేరళలోని తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్( Municipal Elections) ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) ఘన విజయం సాధించింది. మొత్తం 101 వార్డులకు జరిగిన ఎన్నికల్లో NDA 50 స్థానాలు దక్కించుకుని చరిత్ర సృష్టించింది. దీంతో రాష్ట్రంలో పాలకంగా ఉన్న లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (LDF), అలాగే కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF)లకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
Read Also: Sreelekha: కేరళ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం – శ్రీలేఖ విజయం
101 వార్డుల్లో 50 గెలుపుతో కేరళ రాజకీయాల్లో కొత్త మలుపు
ఎన్నికల ఫలితాల్లో( Municipal Elections) LDF 29 వార్డులను గెలుచుకోగా, UDF 19 వార్డులతో సరిపెట్టుకుంది. మరో రెండు వార్డుల్లో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. ఈ ఫలితాలు తిరువనంతపురంలో BJP రాజకీయ బలం పెరుగుతోందని స్పష్టంగా చూపిస్తున్నాయి.
ఈ విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ, తిరువనంతపురం కార్పొరేషన్‌లో NDAకు లభించిన ఆధిక్యతను కేరళ రాజకీయాల్లో కీలక మలుపుగా అభివర్ణించారు. నగర అభివృద్ధి, ప్రజల జీవన సౌలభ్యం మెరుగుపరచడంలో తమ పార్టీ నిబద్ధంగా పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ విజయానికి కారణమైన పార్టీ కార్యకర్తల కృషిని ప్రధాని ప్రత్యేకంగా ప్రశంసించారు.
గతంలో 2020లో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో LDF 52 వార్డులు గెలుచుకుని ఆధిపత్యం చెలాయించగా, NDA 33, UDF 10 వార్డులు మాత్రమే సాధించాయి. అయితే తాజా ఫలితాలు పూర్తిగా భిన్నంగా ఉండటంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా వచ్చే ఏడాది కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, కమ్యూనిస్టుల బలమైన కోటగా భావించే తిరువనంతపురంలో 45 ఏళ్ల తర్వాత BJP ప్రభావం పెరగడం విశేషంగా మారింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: