Mumbai: యువతిపై అత్యాచారం.. నిందితుడిని తేల్చిన DNA పరీక్షలు

Read Time:  1 min
Mumbai: యువతిపై అత్యాచారం.. నిందితుడిని తేల్చిన DNA పరీక్షలు
FONT SIZE
GET APP

ముంబయి (Mumbai) లోని కాఫీ పరేడ్ ప్రాంతంలో వెలుగుచూసిన ఓ దారుణ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. యువతిపై కన్నతండ్రే అత్యాచారానికి పాల్పడ్డాడు.. మూగ, చెవిటి యువతి గతేడాది సెప్టెంబర్ లో అనారోగ్యానికి గురైంది. కడుపు నొప్పిగా ఉందంటూ యువతి సైగలతో నానమ్మకు చెప్పింది. దీంతో యువతిని ఆవిడ ఆసుపత్రికి తీసుకెళ్లింది. వైద్య పరీక్షల్లో యువతి ఐదు నెలల గర్భవతిగా తేలడంతో డాక్టర్లు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

Read Also: Kerala: పుచ్చకాయల లోడులో పేలుడు పదార్థాలు

నిందితుడు కన్నతండ్రే

అయితే, కేసు పెట్టేందుకు యువతి కానీ, ఆమె తండ్రి కానీ ముందుకు రాలేదు.యువతికి కౌన్సెలింగ్ ఇచ్చి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు.. ఓ 17 ఏళ్ల బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. మరో 16 మందిని అనుమానితులుగా తేల్చారు. వీరిలో యువతిపై అత్యాచారం జరిపింది ఎవరనేది నిర్ధారించేందుకు డీఎన్ఏ పరీక్ష నిర్వహించాల్సిందిగా వైద్యులను ఆశ్రయించారు.

mumbai-young-woman-raped-dna-tests-identify-suspect
mumbai-young-woman-raped-dna-tests-identify-suspect

యువతి తండ్రి సహా మొత్తం 17 మంది డీఎన్ఏను యువతి గర్భంలో పెరుగుతున్న పసికందు డీఎన్ఏతో పోల్చిచూడగా.. యువతి కన్నతండ్రి డీఎన్ఏ ఒక్కటే మ్యాచ్ అయింది. దీంతో యువతిపై అత్యాచారం జరిపి ఆమెను గర్భవతిగా చేసిన నిందితుడు కన్నతండ్రేనని స్పష్టమైంది. యువతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.