Mumbai: బెలూన్స్ పేలి ఇద్దరికి గాయాలు

Read Time:  1 min
Mumbai: బెలూన్స్ పేలి ఇద్దరికి గాయాలు
FONT SIZE
GET APP
Mumbai: Two injured in balloon explosion
Mumbai: Two injured in balloon explosion

ముంబై (Mumbai) లో చోటుచేసుకున్న ఓ షాకింగ్ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. లిఫ్ట్‌లో తీసుకెళ్తున్న బెలూన్స్ ఒక్కసారిగా పేలిపోవడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన నగరంలోని ఓ బహుళ అంతస్తుల భవనంలో చోటు చేసుకుంది. ఈ ఘటన అందరినీ భయాందోళనకు గురి చేసింది. ఓ వ్యక్తి బెలూన్స్‌ను లిఫ్ట్‌లో తీసుకెళ్లడానికి ప్రయత్నించాడు. ఇంతలో ఒక్కసారిగా పేలి భారీగా మంటలు చెలరేగాయి. ఈ పేలుడు దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Read Also: Gym: మతమార్పిడుల ఆరోపణలపై NHRC సీరియస్.. కేంద్రం, రాష్ట్రాలకు నోటీసులు?

పేలిపోవడానికి గల కారణాలు

సాధారణంగా బెలూన్లలో హీలియం గ్యాస్ నింపుతుంటారు. అయితే వాటికి మండే గుణం ఉండదు. హైడ్రోజన్ వంటి గ్యాస్ కు మాత్రమే ఈ స్థాయిలో మండే గుణం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మరి సదరు వ్యక్తి.. బెలూన్లలో ఏ గ్యాస్ ను నింపుకొని వచ్చాడో తెలియాల్సి ఉంది. అదే సమయంలో బెలూన్స్ ఒక్కసారిగా పేలిపోవడానికి గల కారణాలపై కూడా స్పష్టత రావాల్సి ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.