కస్టమర్ సమ్మతి లేకుండానే సర్వీస్ ఛార్జ్ వసూలు చేసినందుకు ముంబైలోని ప్రముఖ బోరా బోరా రెస్టారెంట్‌పై(Mumbai Restaurant) కేంద్ర వినియోగదారుల పరిరక్షణ సంస్థ (CCPA) రూ.50,000 జరిమానా విధించింది. రెస్టారెంట్ బిల్లులో భోజన మొత్తం మీద 10 శాతం సర్వీస్ ఛార్జ్‌ను స్వయంచాలకంగా చేర్చడమే కాకుండా, దానిపై అదనంగా జీఎస్టీ కూడా వసూలు చేసినట్లు విచారణలో వెల్లడైంది.
Read Also: MP: భగీరత్‌పురలో కలుషిత నీటి కల్లోలం.. 8 మంది మృతి
ఈ చర్య పూర్తిగా వినియోగదారుల హక్కులకు విరుద్ధమని CCPA స్పష్టం చేసింది. సర్వీస్ ఛార్జ్ అనేది పూర్తిగా కస్టమర్ ఇష్టంపై ఆధారపడే(Mumbai Restaurant) అంశమని, దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ బలవంతంగా వసూలు చేయరాదని గుర్తు చేసింది. హోటళ్లు, రెస్టారెంట్లు సర్వీస్ ఛార్జ్‌ను తప్పనిసరిగా విధించకూడదని ఢిల్లీ హైకోర్టు ఇప్పటికే ఇచ్చిన తీర్పును కూడా CCPA ఈ సందర్భంగా ప్రస్తావించింది. వినియోగదారులు ఇలాంటి అన్యాయ వసూళ్లపై అప్రమత్తంగా ఉండాలని, నిబంధనల ఉల్లంఘనలను గుర్తిస్తే ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: