📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

Mumbai Rains: ముంబైని ముంచెత్తనున్న భారీ వర్షాలు – ఐఎండీ హెచ్చరిక

Author Icon By Sudha
Updated: July 26, 2025 • 4:20 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారీ వర్షాలు ముంబై నగరాన్ని మళ్లీ ముంచెత్తనున్నాయి. ఇప్పటికే ముంబై (Mumbai Rains), థానే, రాయ్‌గడ్, పుణె, సతారా జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. భారత వాతావరణ శాఖ (IMD) తాజా హెచ్చరికల ప్రకారం, శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉంది. సిటీలో జూలై 27వ తేదీ ఉద‌యం వ‌ర‌కు భారీ నుంచి అతిభారీ వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉన్న‌ట్లు ఐఎండీ త‌న హెచ్చ‌రిక‌లో వెల్ల‌డించింది. కొన్ని సంద‌ర్భాల్లో ముంబై (Mumbai Rains)తీరం వెంట సుమారు 50 కిలోమీట‌ర్ల వేగంతో గాలి వీయ‌నున్న‌ది. ముంబైతో(Mumbai Rains) పాటు శివారు ప్రాంతాల్లోనే వ‌ర్ష బీభ‌త్సం కొన‌సాగ‌నున్న‌ది.

Mumbai Rains: ముంబైని ముంచెత్తనున్న భారీ వర్షాలు – ఐఎండీ హెచ్చరిక

ప్ర‌జ‌లు ఎవ‌రూ బ‌య‌ట తిర‌గ‌వ‌ద్దు అని ఐఎండీ పేర్కొన్న‌ది. ముంబైకి ఆరెంజ్ అల‌ర్ట్ జారీ చేశారు. స‌మీప జిల్లాల‌కు కూడా ఈ అల‌ర్ట్ ఇచ్చారు. ఆదివారం ఉద‌యం వ‌ర‌కు ఆరెంజ్ అల‌ర్ట్ కొన‌సాగ‌నున్న‌ది. రాయ్‌గ‌డ్ జిల్లాకు మాత్రం రెడ్ అల‌ర్ట్ జారీ చేశారు. శ‌నివారం ఉద‌యం వ‌ర‌కు మాత్రం పాల్గ‌ర్ జిల్లాకు రెడ్ అల‌ర్ట్ ఇచ్చారు. ముంబైలోని గేట్ వే ఆఫ్ ఇండియా వ‌ద్ద అల‌లు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. వ‌ర్షం వ‌ల్ల ఈస్ట్ర‌న్ ఎక్స్‌ప్రెస్ వే జామైంది. రోడ్డు మొత్తం వాహ‌నాల‌తో నిండిపోయింది. నిలిచిపోయిన వ‌ర్ష‌పు నీటిని తొల‌గించేందుకు బీఎంసీ వ‌ర్క‌ర్లు రంగంలోకి దిగారు.

భారతదేశంలో అతి పెద్ద వరద ఏది?

1954లో గంగా నదిపై ఇప్పటివరకు సంభవించిన అత్యధిక వరద 72 900 m J s”‘ గా నమోదైంది. … … 1000 కిమీ 2 కంటే తక్కువ ఉన్న ప్రాంతాలకు, భారతదేశంలో అత్యధిక వరదలు తీవ్రతలో చాలా తక్కువగా ఉంటాయి.

ముంబైలో ఎక్కువగా వరదలు సంభవించే ప్రాంతం ఏది?

 భారీ వర్షాకాలంలో పోవై ప్లాజా మరియు హిరానందని ఆసుపత్రి కింద ఉన్న ప్రాంతాలు నీటితో నిండిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

ముంబైలో అతిపెద్ద వరద ఎప్పుడు వచ్చింది?

జూలై 26, 2005 న, మధ్యాహ్నం 2:00 గంటల ప్రాంతంలో, ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతం తీవ్రమైన తుఫాను మరియు దాని తరువాత వచ్చిన వరదలతో అతలాకుతలమైంది. శాంటాక్రూజ్‌లోని భారత వాతావరణ శాఖ (IMD) స్టేషన్ 944 మిల్లీమీటర్లు (37.2 అంగుళాలు) నమోదైంది. ముంబైలో ఇది రికార్డు స్థాయిలో అత్యంత వర్షపాతం నమోదైన రోజు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Supreme Court: రూ.12 కోట్ల భరణం కోరిన మహిళకు సుప్రీంకోర్టు

Breaking News Heavy Rainfall IMD alert latest news Maharashtra weather Mumbai rains Mumbai weather Telugu News Thane

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.