हिन्दी | Epaper
అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ…

Mumbai Crime: దివ్యాంగ విద్యార్థినుల పై లైంగిక దాడి కేసులో కీలక తీర్పు

Anusha
Mumbai Crime: దివ్యాంగ విద్యార్థినుల పై లైంగిక దాడి కేసులో కీలక తీర్పు

దివ్యాంగ విద్యార్థినులపై లైంగిక దాడి, వేధింపులకు పాల్పడిన కేసులో ముంబై (Mumbai Crime) లోని పోక్సో ప్రత్యేక న్యాయస్థానం, ఓ పాఠశాల ప్రిన్సిపాల్‌తో పాటు రిటైర్డ్ టీచర్‌ను దోషులుగా నిర్ధారిస్తూ, ఇద్దరికీ ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది..2013లో మాటలు, వినికిడి లోపం ఉన్న 13 ఏళ్ల బాలికను ప్రిన్సిపాల్ తన ఆఫీసుకు పిలిపించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. తనలాగే ఇతర విద్యార్థినులను కూడా వేధిస్తున్నట్లు ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. స్కూల్ నుంచి బహిష్కరిస్తారనే భయంతో బాధితులు ఈ విషయాన్ని తమ కుటుంబ సభ్యులకు చెప్పలేదు. ఇదే పాఠశాలలో పనిచేసే మరో ఉపాధ్యాయుడు కూడా విద్యార్థినులను వేధించేవాడు.

Read Also: Rajdhani Express: ఏనుగుల గుంపును ఢీకొట్టిన రాజధాని .. పట్టాలు తప్పిన బోగీలు

Mumbai Crime: Key verdict in sexual assault case against disabled students
Mumbai Crime: Key verdict in sexual assault case against disabled students

విచారణ జరిపిన ప్రత్యేక కోర్టు

2014 మే నెలలో జరిగిన తల్లిదండ్రుల సమావేశంలో ఈ దారుణాలు వెలుగులోకి వచ్చాయి. అయినప్పటికీ నిందితుల ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో బాధితులు, వారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన ప్రత్యేక కోర్టు నిందితులను దోషులుగా తేల్చింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి సత్యనారాయణ ఆర్. నవందర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “పాఠశాల ఒక పవిత్ర స్థలం. పిల్లలు ఉపాధ్యాయులను మార్గదర్శకులుగా, దైవంగా భావిస్తారు. అలాంటి నమ్మకానికే ద్రోహం చేసి,

వారే లైంగికంగా హింసిస్తే బాధితులు జీవితాంతం ఆ గాయంతో జీవించాల్సి వస్తుంది” అని న్యాయమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులు వృద్ధులు కావడంతో పోక్సో చట్టంలోని సెక్షన్ 10 ప్రకారం కనీస శిక్ష విధిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే, నిందితుల నుంచి వసూలు చేసిన జరిమానా (ఒక్కో బాధితురాలికి రూ. 15,000) ఏమాత్రం సరిపోదని వ్యాఖ్యానించిన కోర్టు.. బాధితులకు తగిన నష్టపరిహారం అందించాలని జిల్లా న్యాయ సేవా సంస్థను (DLSA) ఆదేశించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870