దేశ ఆర్థిక రాజధాని ముంబైలో (Mumbai) సోమవారం రాత్రి తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. నగర ప్రజా రవాణా వ్యవస్థకు చెందిన బెస్ట్ బస్సు అదుపుతప్పి పాదచారులపైకి దూసుకెళ్లడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం భాండూప్ ప్రాంతంలోని స్టేషన్ రోడ్డు సమీపంలో రాత్రి 10 గంటల సమయంలో జరిగింది.
Read also: PAN-Aadhaar Link: పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు!
Tragic road accident in Mumbai
పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం, బస్సు తన రూట్ పూర్తిచేసుకుని చివరి స్టాప్ వద్ద రివర్స్ తీసుకుంటున్న సమయంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో వెనుక వైపు ఉన్న పాదచారులపైకి బస్సు వేగంగా దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో సంతోష్ రమేశ్ సావంత్ (52) డ్రైవర్‌గా, భగవాన్ భౌ ఘారే (47) కండక్టర్‌గా విధుల్లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఘటన జరిగిన వెంటనే స్థానికులు సహాయక చర్యలు చేపట్టి గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ ప్రమాదంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది అత్యంత దురదృష్టకరమైన సంఘటన అని పేర్కొంటూ, మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ప్రమాదానికి గల అసలు కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బస్సులో సాంకేతిక లోపం ఉందా? లేక డ్రైవర్ నిర్లక్ష్యం కారణమా? అనే అంశాలపై విచారణ కొనసాగుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: