MukulRoy: రైల్వే మాజీ మంత్రి ముకుల్ రాయ్ మృతి

Read Time:  1 min
MukulRoy
MukulRoy
FONT SIZE
GET APP

MukulRoy: తృణమూల్ కాంగ్రెస్ (TMC) సీనియర్ నేత, రైల్వే మాజీ మంత్రి ముకుల్ రాయ్ (71) గుండెపోటుతో కన్నుమూశారు. కోల్‌కతాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుమారుడు సుభ్రాంశు రాయ్ తెలిపారు.

Read Also: Vishnupriya father murder : కోలీవుడ్ నటి విష్ణుప్రియ తండ్రి హత్య దోపిడీనా? ప్రతీకారమా?

MukulRoy
MukulRoy: Former Railway Minister Mukul Roy passes away

ఒకప్పుడు సీఎం మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడిగా ఉన్న ముకుల్ రాయ్, TMCలో కీలక నాయకుడిగా ఎదిగి పార్టీలో రెండో స్థానం కలిగిన నేతగా గుర్తింపు పొందారు. 2017లో రాజకీయ మార్పు చేస్తూ ఆయన భారతీయ జనతా పార్టీలో చేరారు. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ బలపడటంలో, 18 లోక్‌సభ స్థానాలు గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కృష్ణానగర్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన ముకుల్ రాయ్, ఆ తర్వాత మళ్లీ TMCలో చేరి రాజకీయంగా చర్చకు దారి తీశారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.