MRK Panneerselvam: హిందీపై మంత్రి షాకింగ్ కామెంట్స్

Read Time:  1 min
MRK Panneerselvam: హిందీపై మంత్రి షాకింగ్ కామెంట్స్
FONT SIZE
GET APP

హిందీ భాషపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ తమిళనాడు మంత్రి MRK పన్నీర్‌సెల్వం (MRK Panneerselvam) షాకింగ్ కామెంట్లు చేశారు. ఉత్తరాది ప్రజలు కేవలం హిందీ నేర్చుకోవడం వల్ల వారు తమిళనాడులో పానీపూరీ సెల్లర్లు, నిర్మాణ కార్మికులు, టేబుల్ క్లీన్ చేసేవారిగా స్థిరపడుతున్నారని ఎద్దేవా చేశారు.

Read Also: Ishaan Tharoor: AI ఎఫెక్ట్ తో ఉద్యోగం కోల్పోయిన శశిథరూర్ కుమారుడు

ద్విభాషా విధానం వల్ల తమిళ విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు

అలాగే తమిళనాడు అనుసరిస్తున్న ద్విభాషా విధానాన్ని సమర్థిస్తూ.. “మా పిల్లలు తమిళంతో పాటు ఆంగ్లాన్ని కూడా అనర్గళంగా నేర్చుకుంటున్నారు. అందుకే వారు అమెరికా, లండన్ వంటి దేశాలకు వెళ్లి కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు. మా ద్విభాషా విధానం వల్ల తమిళ విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు” అని పన్నీర్‌సెల్వం (MRK Panneerselvam) ధీమా వ్యక్తం చేశారు.

MRK Panneerselvam: Minister's shocking comments on Hindi
MRK Panneerselvam: Minister’s shocking comments on Hindi

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ‘నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ’, త్రిభాషా సూత్రంపై డీఎంకే ప్రభుత్వం ఎప్పటి నుంచో పోరాటం చేస్తోంది. హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నం జరుగుతోందని సీఎం స్టాలిన్ సహా మంత్రులు అందరూ ఆరోపిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.