దివంగత మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణంపై శివసేన ఎంపీ సంజయ్(MP Sanjay) రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా బయటకు వస్తున్న సమాచారం, పరిణామాలను గమనిస్తే ఈ విమాన ప్రమాదం సాధారణంగా జరిగిందా అనే అనుమానాలు బలపడుతున్నాయని ఆయన తెలిపారు. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.
Read Also: Tamil Nadu: టీవీకే వార్షికోత్సవం.. అసెంబ్లీ ఎన్నికలల్లో విజయం మనదే: విజయ్
బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తుతామని, అజిత్ పవార్ మృతిపై దేశ ప్రజలకు స్పష్టత రావాల్సిన అవసరం ఉందని రౌత్(MP Sanjay) అన్నారు. అలాగే ఎన్సీపీ రెండు వర్గాల విలీనానికి బీజేపీ అడ్డంకిగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. రాజకీయంగా కీలకమైన దశలో అజిత్ పవార్ లాంటి అనుభవజ్ఞుడైన నేత విమాన ప్రమాదంలో మృతి చెందడం అనేక సందేహాలకు తావిస్తోందని పేర్కొన్నారు.
ఈ ఘటన వెనుక రాజకీయ కుట్ర కోణం ఉందా? సాంకేతిక లోపాల వల్లే ప్రమాదం జరిగిందా? అనే అంశాలపై పూర్తి స్థాయి విచారణ జరగాల్సిన అవసరం ఉందని శివసేన నేతలు అభిప్రాయపడుతున్నారు. దర్యాప్తు ద్వారా నిజాలు వెలుగులోకి రావాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సంజయ్ రౌత్ స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epapervaartha.com
Read Also: