Rajya Sabha MP controversy : కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరికి పార్లమెంటు సభా హక్కుల కమిటీ నుంచి నోటీసులు జారీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పార్లమెంట్ ప్రాంగణంలోకి ఒక వీధి కుక్కను తీసుకురావడం, అలాగే ఎంపీలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై కమిటీ ఆమె వివరణ కోరింది. ఈ నెల 23లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.
గత డిసెంబర్‌లో జరిగిన శీతాకాల సమావేశాల సమయంలో రేణుకా చౌదరి తన కారులో గాయపడిన ఒక వీధి కుక్కను పార్లమెంట్ ప్రాంగణంలోకి తీసుకువచ్చినట్లు సమాచారం. దీనిపై కొందరు సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయగా, “లోపల కూర్చున్న వారే కరుస్తారు, కుక్కలు కరవవు” అనే వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యాఖ్యలను ప్రజాప్రతినిధుల గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని పేర్కొంటూ బీజేపీ ఎంపీలు బ్రిజ్ లాల్, ఇందు బాలా గోస్వామి ప్రివిలేజ్ నోటీసు ఇచ్చారు. భద్రతా నిబంధనలు ఉల్లంఘించబడ్డాయని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు.
Read Also: India vs Pakistan T20 : భారత్‌పై టాస్ గెలిచిన పాక్, మ్యాచ్ ఎవరిది?
ఈ అంశంపై సమావేశమైన సభా హక్కుల కమిటీ రాతపూర్వక వివరణ కోరాలని నిర్ణయించింది. మీడియా ప్రశ్నలకు స్పందిస్తూ ఆమె చేసిన వ్యంగ్య వ్యాఖ్యలు కూడా చర్చకు దారితీశాయి. అయితే గాయపడిన జంతువును రక్షించేందుకే తీసుకువచ్చానని, జంతు సంక్షేమంపై ప్రభుత్వానికి తగిన శ్రద్ధ లేదని ఆమె అప్పట్లో పేర్కొన్నారు. ప్రస్తుతం నోటీసులపై రాజ్యాంగం, పార్లమెంటరీ నిబంధనలకు అనుగుణంగా సమాధానం ఇస్తామని ఆమె కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: