हिन्दी | Epaper

అత్తా కోడళ్లు డిశ్యుమ్ డిశ్యుమ్

Anusha
అత్తా కోడళ్లు డిశ్యుమ్ డిశ్యుమ్

అత్తాకోడళ్ల గొడవలు ఇంట్లోనే పరిష్కారం చేసుకుంటే సరిపోతుంది. కానీ కొన్ని సార్లు ఈ గొడవలు రోడ్డెక్కి పెద్ద సమస్యగా మారతాయి. మహారాష్ట్రలోని నాసిక్‌లో ఓ అత్తాకోడళ్ల గొడవ ఏకంగా కోర్టు ఆవరణలోనే యుద్ధానికి దారితీసింది. అత్తా కోడళ్ల మధ్య జరిగిన ఈ హైడ్రామా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.కుటుంబ సమస్యల కారణంగా నాసిక్ కోర్టులో ఓ కేసు నడుస్తోంది. ఈ కేసు విచారణ నిమిత్తం కోర్టుకు వచ్చిన అత్తా కోడళ్ల మధ్య మొదట మాటా మాటా పెరిగింది. ఇద్దరూ ఒకరినొకరు మాటలతో తిట్టుకోవడం ప్రారంభించారు. అయితే కొన్ని నిమిషాలకే అది యుద్ధానికి దారితీసింది. కోర్టు ముందు నేరుగా ఒకరిపై ఒకరు దాడి చేయడం ప్రారంభించారు.ఇద్దరూ ఒకరిపై ఒకరు కోపంతో పిడిగుద్దులు విసరడం, చున్నీ పట్టుకోవడం, కాళ్లు, చేతులతో దాడి చేయడం మొదలైంది. ఈ ఫైట్‌లో అత్తా కోడళ్లే కాకుండా, వారి కుటుంబ సభ్యులు కూడా జోక్యం చేసుకున్నారు. అటు అత్తవైపు ఉన్నవాళ్లు, ఇటు కోడలవైపు ఉన్నవాళ్లు తమ వాదనకు అనుకూలంగా తిట్ల వర్షం కురిపించారు.

ఆడ, మగ తేడా లేకుండా విరుచుకుపడ్డ వైనం!

ఈ గొడవలో కేవలం మహిళలు మాత్రమే కాకుండా, వారి కుటుంబంలోని మగవారు కూడా పాల్గొన్నారు. మగవాళ్లు ఒకరిపై ఒకరు దాడి చేయగా, మహిళలు కూడా తమ వంతుగా కొట్టుకున్నారు.

మహారాష్ట్రలోని నాసిక్‌ కోర్టు

కోర్టు గేటు ముందే రెండు కుటుంబాలకు చెందిన వారు వీర లెవల్‌లో రెచ్చిపోయారు. ఆడ, మగ తేడా లేకుండా విపరీతంగా దాడి చేసుకున్నారు. ఒకరి సిగలు మరొకరు పట్టుకుని కింద, మీద పడుకుంటూ కొట్టుకున్నారు. అందులో ఆడవాళ్లను మగవాళ్లు,మగవాళ్లను ఆడవాళ్లు,మగవాళ్లను మగవాళ్లు,ఆడవాళ్లను ఆడవాళ్లు పిచ్చిపిచ్చిగా కొట్టుకున్న దృశ్యాలను స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ వీడియోలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి.అయితే అక్కడ ఈ గొడవను చూస్తున్న స్థానికులు, లాయర్లు, కోర్టు సిబ్బంది.షాక్‌కు గురయ్యారు. చివరికి పోలీసులు జోక్యం చేసుకుని ఆ రెండు వర్గాలను విడదీసే వరకు తన్నుకుంటూనే ఉన్నారు. ఇక ఈ గొడవలో రెండు వర్గాలు బాగా కొట్టుకున్నాయి. ఇందులో ఒకరి బట్టలు మరొకరు చించుకున్నారు. ఓవైపు కొట్టుకుంటూనే.మరోవైపు వారంతా ఒకరినొకరు తిట్టుకున్నారు. ఇక గొడవ సమయంలో ఒకరిపై మరొకరు పడి, కూర్చోని కొట్లాటకు దిగారు. వీరు పక్కనే ఉన్న వాహనాలపై పడటంతో అవి కూడా కిందపడిపోయాయి.

గొడవ చూసిన స్థానికులు,అత్త, కోడళ్ల మధ్య ఎంత పెద్ద వివాదాలు ఉన్నా మరీ నడిరోడ్డుపై, అదీ కోర్టు ముందే ఈ రేంజ్‌లో కొట్టుకోవడం చూసి షాక్ అవుతున్నారు. చివరికి స్థానిక పోలీసులు వచ్చి.జోక్యం చేసుకుని రెండు వర్గాలను చెదరగొట్టారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి కేసు నమోదు చేశారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!
0:26

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!
0:32

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

📢 For Advertisement Booking: 98481 12870