భారతదేశంలో వర్షాల ప్రధాన మూలమైన నైరుతి రుతుపవనాలు (Monsoon) 2024లో సాధారణ సమయానికి ఎనిమిది రోజులు ముందుగానే దేశంలో ప్రవేశించాయి. గత కొన్ని రోజులుగా భానుడి ప్రతాపంతో అల్లాడుతున్న దేశ ప్రజలకు గుడ్ న్యూస్. దేశానికి అత్యధికంగా వర్షపాతానిచ్చే నైరుతి రుతుపవనాలు (Monsoon) శనివారం కేరళలో ప్రవేశించాయి. సాధారణం కంటే ఎనిమిది రోజుల ముందే ఈ రుతుపవనాలు దేశంలోకి వచ్చాయి. దీంతో 2009 తర్వాత భారత ప్రధాన భూభాగంలోకి రుతుపవనాలు (Monsoon) ముందుగా ప్రవేశించాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. అంటే 16 ఏళ్ల తర్వాత నైరుతి రుతు పవనాలు అంచనాల కంటే ముందుగా వచ్చేశాయి. చివరిసారిగా 2001, 2009లో రుతుపవనాలు (Monsoon) అనుకున్న సమయం కంటే ముందుగానే కేరళలోకి ప్రవేశించాయి. ఆ రెండేళ్లలో మే 23నే కేరళను తాకాయి. సాధారణంగా జూన్ 1 నాటికి రుతుపవనాలు భారతదేశంలో ప్రవేశిస్తాయి. అయితే 1918లో అత్యంత వేగంగా మే 11న కేరళను తాకి రికార్డు సృష్టించాయి. ఆలస్యంగా ప్రారంభమైన రికార్డు 1972లో నమోదైంది. ఆ ఏడాది రుతుపవనాలు జూన్ 18 నాటికి ప్రారంభమయ్యాయి. గత 25ఏళ్లలో 2016లో ఆలస్యంగా రుతుపవనాలు జూన్ 9న కేరళలోకి ప్రవేశించాయి.
మహారాష్ట్ర – అరేబియా సముద్రంలో అల్పపీడనం ప్రభావం
గతేడాది మే 30న, 2023లో జూన్ 8, 2022లో మే 29, 2021లో జూన్ 3, 2020లో జూన్ 1, 2019లో జూన్ 8, 2018లో మే 29న నైరుతి రుతుపవనాలు దేశంలో ప్రవేశించాయి. ఈ సారి అన్నింటికంటే వేగంగా కేరళను తాకి 16 ఏళ్ల తర్వాత రికార్డు సృష్టించాయి. దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, దక్షిణ కర్ణాటక, కొంకణ్, గోవాలో అతి భారీ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ అంచనా వేసింది. మే 29 వరకు కేరళ, తీరప్రాంత కర్ణాటకలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈదురుగాలులు గంటకు 40-50 కి.మీ వేగంతో వీస్తాయని పేర్కొంది. తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో కూడా రాబోయే ఐదు రోజుల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
భారత వాతావరణ శాఖ సూచనలు
దక్షిణ కొంకణ్ తీరానికి సమీపంలో తూర్పు-మధ్య అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడి మే 24 ప్రారంభంలో రత్నగిరికి వాయువ్యంగా 40 కి.మీ దూరంలో కేంద్రీకృతమవుతుందని ఐఎండీ అంచనా వేసింది. ఇది తూర్పు వైపునకు కదిలి శనివారం రత్నగిరి, దపోలి మధ్య తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. మహారాష్ట్ర తీరప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ శుక్రవారం మధ్యాహ్నం రెడ్ అలర్ట్ జారీ చేసింది. ముంబయిలో మెరుపులు, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని, ఆ సమయంలో గంటకు 40- 50 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని అంచనా వేసింది. భారత వాతావరణ శాఖ గోవాకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో ఆదివారం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ముందు జాగ్రత్త చర్యగా నదులు, జలపాతాల నుంచి దూరంగా ఉండాలని పేర్కొంది. గత 24 గంటల్లో గోవా తీరప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ఉత్తరాది రాష్ట్రాల్లో రుతుపవనాల ప్రభావం
మే 24న ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, యూపీలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులుతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. జమ్ముకశ్మీర్, లద్ధాఖ్, పంజాబ్, హరియాణా, చండీగఢ్, రాజస్థాన్ లోని కొన్ని ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాబోయే కొన్ని రోజుల్లో ఝార్ఖండ్ అంతటా ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతుందని తెలిపింది. మే 24-26 మధ్య బంగాల్, సిక్కిం, మధ్యప్రదేశ్, విదర్భ, ఛత్తీస్ గఢ్, ఒడిశా, బిహార్ లో ఉరుములు, ఈదురుగాలులుతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. శనివారం, ఆదివారం మధ్యప్రదేశ్, బిహార్ లో గంటకు 50-70 కి.మీ వేగంతో గాలులు వీస్తాయి. అండమాన్ నికోబార్ (మే 24-26), విదర్భ, ఛత్తీస్ గఢ్ (మే 24), బిహార్ (మే 25), ఒడిశా (మే 24, మే 27-29), బంగాల్, సిక్కిం (మే 28-29) లలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సాధారణ కంటే ముందుగా రావడం పలు పంటల సాగుకు, జలసంఘటనలకు దోహదపడే అవకాశం ఉంది. ఇదే సమయంలో భారీ వర్షాలు, గాలులు కారణంగా వాతావరణ ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది.
Read Also: Trump: హార్వర్డ్‌పై ట్రంప్ పరిపాలన.. ఘాటుగా స్పందించిన చైనా