మలయాళ సినీ నటుడు మోహన్‌లాల్కు కేరళ హైకోర్టులో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆయన వద్ద ఉన్న ఏనుగు(Mohanlal) దంతాల సేకరణను చట్టబద్ధం చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు(High court) రద్దు చేసింది. అలాగే, మోహన్‌లాల్ పేరుతో జారీ చేసిన లైసెన్స్ కూడా కోర్టు చెల్లనిదిగా ప్రకటించింది.
హైకోర్టు తీర్పులో, 2015లో జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వుల్లో విధానపరమైన లోపాలు ఉన్నాయని, అవి అధికారిక గెజిట్‌లో ప్రచురించబడలేదని పేర్కొంది. అందువల్ల ఆ ఉత్తర్వులు చెల్లుబాటు కాబోవని స్పష్టం చేసింది. వన్యప్రాణుల సంరక్షణ చట్టాలకు సంబంధించిన అంశాల్లో ప్రభుత్వం చట్టపరమైన విధానాలను పాటించాలి అని కోర్టు సూచించింది. అలాగే, ఈ అంశంపై కొత్తగా నోటిఫికేషన్ జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Read also: పాక్ కు నీళ్లు బంద్ చేయనున్న ఆఫ్ఘనిస్థాన్
2011లో కొచ్చి నగరంలోని తేవర ప్రాంతంలో ఉన్న మోహన్‌లాల్ నివాసంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆ సమయంలో ఆయన(mohanlal) ఇంట్లో రెండు జతల ఏనుగు దంతాలు లభించాయి. దీంతో చట్ట విరుద్ధంగా వన్యప్రాణి అవశేషాలను కలిగి ఉన్నారనే ఆరోపణలతో అటవీ శాఖ కేసు నమోదు చేసింది.
తరువాత రాష్ట్ర ప్రభుత్వం కేసును ఉపసంహరించుకునే ప్రయత్నం చేసినా, పెరుంబవూర్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు ఆ నిర్ణయాన్ని తిరస్కరించింది. ఈ ఆదేశాన్ని సవాలు చేస్తూ మోహన్‌లాల్ హైకోర్టును ఆశ్రయించారు. మరోవైపు, జేమ్స్ మాథ్యూ అనే వ్యక్తి మోహన్‌లాల్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వేరుగా పిటిషన్ దాఖలు చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం హైకోర్టు తాజా తీర్పును ఇచ్చింది. ఈ నిర్ణయంతో మోహన్‌లాల్‌పై ఉన్న ఏనుగు దంతాల కేసు మళ్లీ న్యాయపరమైన దశలోకి ప్రవేశించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: