Mohammed Shami : భారత క్రికెటర్ Mohammed Shami ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)లో భాగంగా ఎన్నికల అధికారుల ఎదుట హాజరయ్యారు. పశ్చిమ బెంగాల్‌లో కొనసాగుతున్న ఈ ప్రక్రియలో భాగంగా పలువురు ప్రముఖులకు నోటీసులు జారీ చేయగా, వాటిలో షమీ పేరు కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఆయన కోల్‌కతాలోని బిక్రంగఢ్ ప్రాంతంలో ఉన్న ఒక పాఠశాలలో ఎన్నికల సంఘం అధికారుల ముందు హాజరై అవసరమైన పత్రాలను సమర్పించారు.
ఎస్ఐఆర్ దరఖాస్తులో షమీ సమర్పించిన వివరాల్లో కొన్ని వ్యత్యాసాలు ఉన్నట్లు గుర్తించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. అదే కారణంగా విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు. ఇంతకుముందు ఒకసారి నోటీసులు ఇచ్చినా, క్రికెట్ మ్యాచ్ షెడ్యూల్ కారణంగా షమీ హాజరుకాలేకపోయారని, అందువల్ల మరో అవకాశం ఇచ్చినట్లు అధికారులు చెప్పారు.
Read Also: CBN Davos Tour : గూగుల్ క్లౌడ్, IBM CEOలతో చంద్రబాబు భేటీ
ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన షమీ, తన వృత్తిరీత్యా ప్రస్తుతం కోల్‌కతాలో నివసిస్తున్నారు. ఈ క్రమంలోనే నగరంలోని 93వ వార్డులో (Mohammed Shami) ఓటరుగా నమోదు చేసుకున్నారని, అది రాస్‌బిహారీ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోకి వస్తుందని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: