📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్

Telugu News: Mohammed Moquim: ప్రియాంక కాంగ్రెస్ పగ్గాలు చేపట్టాలి మాజీ ఎమ్మెల్యే డిమాండ్

Author Icon By Sushmitha
Updated: December 12, 2025 • 5:44 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఒడిశా మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ మోక్విమ్, (Mohammed Moquim) కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలను ప్రియాంక గాంధీ వాద్రాకు అప్పగించాలని కోరుతూ అగ్రనేత సోనియా గాంధీకి (Sonia Gandhi) ఆరు పేజీల సంచలన లేఖ రాశారు. వయసు పైబడటంతో ప్రస్తుత అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను బాధ్యతల నుంచి తప్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. యువతను ఆకట్టుకోవాలంటే యువ నాయకత్వం అవసరమని, పార్టీని ప్రక్షాళన చేయాలని మోక్విమ్ అభిప్రాయపడ్డారు.

Read Also: Indian Citizenship: భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు

నాయకత్వ మార్పు ఆవశ్యకత: ఖర్గేకు వయసు అడ్డంకి

ఏఎన్ఐ వార్తా సంస్థతో మోక్విమ్ మాట్లాడుతూ, “పార్టీ క్లిష్ట దశలో ఉంది.. కాంగ్రెస్‌కు కొత్త నాయకత్వం అవసరం. మల్లికార్జున ఖర్గేకు వయసు ప్రధాన ఆటంకం. అందుకే మనం యువ నాయకులను ముందుకు తీసుకురావాలి” అని అభిప్రాయపడ్డారు. సోనియా గాంధీ, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు దీనిపై కచ్చితంగా చర్చిస్తారనే నమ్మకం ఉందని ఆయన తెలిపారు.

బీజేపీ ఆరోపణల నేపథ్యంలో (రాహుల్, ప్రియాంక వర్గాల మధ్య ఆధిపత్య పోరు), ఈ లేఖ ప్రాధాన్యత సంతరించుకుంది. యువతకు కాంగ్రెస్ పార్టీ చేరువ కావాలంటే యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాల్సిన సమయం ఆసన్నమైందని బారాబతి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పేర్కొన్నారు.

రాహుల్‌పై పరోక్ష విమర్శలు, వారసత్వం కోల్పోయే ప్రమాదం

మహమ్మద్ మోక్విమ్ ఈ సందర్భంగా రాహుల్ గాంధీపై కూడా పరోక్షంగా విమర్శలు చేశారు. గత మూడేళ్లుగా రాహుల్‌ను కలవడానికి తాను చాలా ప్రయత్నించినా, అపాయింట్‌మెంట్ దొరకలేదని లేఖలో పేర్కొన్నారు.

“శతాబ్దపు వారసత్వం ఇతరుల ఓడించడం ద్వారా కాదు.. మనం తీసుకున్న నిర్ణయాల ద్వారా చేజారిపోయింది. మనం ఇప్పుడు మేల్కొనకపోతే వారసత్వంగా పొందిన కాంగ్రెస్‌ను కోల్పోయే ప్రమాదం ఉంది” అని ఘాటుగా వ్యాఖ్యానించారు. మోక్విమ్ కుమార్తె సోఫియా ఫిర్దౌస్ గతేడాది ఎన్నికల్లో బీజేపీ, బీజేడీలను తట్టుకుని చారిత్రాత్మక విజయం సాధించారని, ఈ విజయం ప్రజల మనసులను గెలవడం ద్వారా వచ్చిందని తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

2019 Congress defeat age factor for leadership Barabati Cuttack constituency Latest News in Telugu Mallikarjun Kharge removal demand Mohammed Moquim former Odisha MLA party purification Priyanka Gandhi Vadra leadership Rahul Gandhi meeting issues Sophia Firdous daughter Telugu News Today Wayanad by-election.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.