ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)జూన్ 6, 2025న జమ్మూ కశ్మీర్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా, ఆయన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన (Railway bridge)అయిన చీనాబ్ బ్రిడ్జ్‌ను(Chenab Bridge) ప్రారంభించనున్నారు.
విజన్‌కు ఆ బ్రిడ్జ్ చిహ్నం
ఏప్రిల్ 22వ తేదీన పెహల్గామ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత తొలిసారి ఆయన జమ్మూకశ్మీర్‌కు వెళ్తున్నారు. చీనాబ్ నదిపై రైల్వే బ్రిడ్జ్ ఓపెనింగ్ అంశాన్ని పీఎంవో సహాయ మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. మరో మూడు రోజుల్లో చరిత్ర చోటుచేసుకోనున్నట్లు చెప్పారు.
ఉదంపూర్.. శ్రీనగర్.. బారాముల్లా రైల్వే లింక్ రూట్‌లో చీనాబ్ నదిపై బ్రిడ్జ్‌ను నిర్మించారు. ప్రకృతి విపత్తులను తట్టుకునే రీతిలో దాన్ని దృఢంగా తయారు చేశారు. నవ భారతానికి చెందిన శక్తికి, విజన్‌కు ఆ బ్రిడ్జ్ చిహ్నంగా నిలుస్తుందని మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. చీనాబ్ నదిపై సుమారు 358 మీటర్ల ఎత్తులో బ్రిడ్జ్‌ను నిర్మించారు. ఇది పారిస్‌లోని ఈఫిల్ టవర్ కన్నా 35 మీటర్లు ఎత్తుగా ఉంటుంది.ప్రధాని పర్యటన సందర్భంగా జమ్మూలో భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టబడ్డాయి. ప్రధాన రహదారులపై ట్రాఫిక్ నియంత్రణ, డ్రోన్లు, పారాగ్లైడర్లు, మైక్రోలైట్ విమానాలపై నిషేధం వంటి చర్యలు అమలు చేయబడ్డాయి
ఈ చీనాబ్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవం, జమ్మూ కశ్మీర్‌లోని రైల్వే కనెక్టివిటీని మరింత బలోపేతం చేయడంలో కీలకమైన ఘట్టంగా నిలుస్తుంది.
Read Also : BrahMos-2: బ్రహ్మోస్ క్షిపణుల సత్తాకు పాక్ నేతల ప్రశంసలు