📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం

Telugu News: Modi-మణిపూర్ అల్లర్లకు కారణం.. రెండేళ్ల తర్వాత మోదీ పర్యటన

Author Icon By Pooja
Updated: September 13, 2025 • 5:02 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Modi-మణిపూర్ ఒకప్పుడు అందాల రాష్ట్రం. కొండలు, పచ్చని పొలాలు, జలపాతాలు, అడవులతో పర్యాటకులను ఇట్టే ఆకర్షించే ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. గిరిజనులు అధికంగా ఉండే మణిపూర్ ప్రకృతి ఒడిలో చూడదగ్గ అందాలు ఎన్నో ఉన్నాయి. రమణీయమైన జలపాతాలకు కొదువలేదు. ఎక్కడ చూసినా పచ్చని బయళ్లు, పంటపొలాలు చూసేందుకు రెండు కళ్లు చాలవు.. మణిపూర్ సంస్కృతి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ ఇదంతా ఓ గతం. ప్రస్తుతం అక్కడ భయానక వాతావరణమే కనిపిస్తుంది. మణిపూర్ అల్లర్లు గత రెండేళ్లుగా సోషల్ మీడియా(Social Media), వార్తల్లో వినిపిస్తూనే ఉంది. 2023 మే 23న ప్రారంభమైన అల్లర్లు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు ఈ అల్లర్ల హింసకు 258మందిపైగానే బలైయ్యారు. వేలల్లో ప్రజలు గాయపడ్డారు. చర్చిలను, గృహాలను తగలబెట్టారు. నడివీధుల్లో ప్రజల్ని చంపేసారు.

రెండేళ్ల తర్వాత మోదీ పర్యటన

మణిపూర్ అల్లర్లు జరిగి రెండేళ్లు గడిచిపోయింది. శనివారం మధ్యాహ్నం ప్రధాని మోదీ ఈ రాష్ట్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మణిపూర్ లోని చురాచంద్ పుర్ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ ‘మణిపూర్ ప్రజలారా మీ వెంట నేనున్నా. మీ వెంట భారత ప్రభుత్వం ఉంది. ఈ రాష్ట్రంలో 7వేల కొత్త ఇళ్లు నిర్మిస్తున్నాం, ఇక్కడి ప్రజల మేలు కోసం కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటోంది’ అన్నారు. కొద్దిసేపటి క్రితమే ఈ వేదికపై రూ.7,300 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశానని మోదీ వెల్లడించారు. అర్బన్ రోడ్లు, డ్రైనేజీ, ఆస్తి నిర్వహణ మెరుగుదల ప్రాజెక్టుకు రూ.3,6000 కోట్లకు పైగా పునాది వేశారు. తొమ్మిది ప్రదేశాలలో వర్కింగ్ ఉమెన్ హాస్టళ్లు, ఇన్ఫోటెక్ డెవలప్మెంట్ ప్రాజెక్టు, ఐదు జాతీయ రహదారి ప్రాజెక్టుల కోసం రూ.2,500 కోట్లకు పైగా కేటాయించినట్లు మోదీ చెప్పారు.

బాధిత కుటుంబసభ్యులను పరామర్శించిన మోదీ

చురాచందర్ పుర్ జిల్లాకు చేరుకున్న ప్రధాని మోదీ అక్కడ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. రెండేళ్ల తర్వాత ప్రధాని మణిపూర్ కు వెళ్లడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. మోదీ ప్రపంచ దేశాలన్నీ పర్యటిస్తారు కానీ మణిపూర్ ను మాత్రం దర్శించరు. మణిపూర్ దేశంలో భాగం కాదంటూ నిత్యం ప్రతిపక్షాలు అధికార పార్టీని విమర్శించేది.

అల్లర్లకు కారణం ఏమిటి?

మణిపూర్ లో అల్లర్లకు కారణాలలో ఒకటి మైత్రీలకు ఎస్టీ హోదా ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని హైకోర్టు(High Court) ప్రభుత్వాన్ని ఆదేశించడంతో మొదలైంది. దీంతో 2023 మేలో కూకీలు దీనికి నిరసనగా ర్యాలీని నిర్వహించింది. అనంతరం మైతీలు కూడా నిరసన ర్యాలీని నిర్వహించింది. దీంతో ఒక్కసారిగా అల్లర్లు చెలరేగాయి. వేలాది ఇళ్లు, దుకాణాలు, చర్చిలు అగ్నికి ఆహుతి అయ్యాయి. లక్షల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయిలై, సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. మహిళలపై అత్యంత దారుణంగా లైంగిక దాడులు జరిగాయి. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి, వారిపై లైంగిక దాడి చేసిన వీడియో బయటపడటంతో దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు వ్యక్తమయ్యాయి. సుప్రీంకోర్టు ఈ ఉదంతాన్ని సుమోటో కేసుగా నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నది.

పోలీసుల నుంచి కూకీలు, నాగాలు, మైతీలు భారీగా ఆయుధాలను తీసుకుని ఒకరిపై ఒకరు దాడులకు, హత్యలకు పాల్పడ్డారు. శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించిపోయాయి. విపక్షాలు, ప్రజల నుంచి పెద్దఎత్తున వ్యతిరేకతలు రావడంతో ముఖ్యమంత్ర బీరెన్ సింగ్ న పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.

కొనసాగుతున్న రాష్ట్రపతి పాలన

రాష్ట్రంలో శాంతిభద్రతలు కొరవడంతో కేంద్రం మణిపూర్ లో రాష్ట్రపతి పాలనను ప్రకటించింది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి రాష్ట్రపతి పాలనే కొనసాగుతున్నది. ఇటీవలే దీన్ని 2026 ఫిబ్రవరి 13 వరకు మరోసారి పెంచారు. రాష్ట్రంలో సాధారణ పాలన కొనసాగే అవకాశం లేనందున ఎన్నికలు నిర్వహించలేమని కేంద్రం చెబుతున్నది.

మణిపూర్ అల్లర్లకు ప్రధాన కారణం మెయితీలకు షెడ్యూల్డ్ తెగ (ST) హోదా కల్పించాలని హైకోర్టు ఆదేశించడం. దీని ద్వారా వారికి రిజర్వేషన్లు, కొండ ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేసే అవకాశం లభించనుండటంతో కుకీ, నాగా తెగలు వ్యతిరేకించాయి. రాష్ట్రంలో 90% భూమి కొండ ప్రాంతాల్లో ఉండగా, గిరిజనేతరులకు అక్కడ భూమి కొనుగోలు నిషేధం ఉంది. ST హోదా కలిస్తే ఈ ఆంక్ష తొలగిపోతుంది. అదనంగా, రిజర్వ్ మరియు ప్రొటెక్టెడ్ ఫారెస్ట్‌ల నుంచి గిరిజనులను తొలగించడం కూడా అసంతృప్తిని రేపి ఆందోళనలకు దారితీసింది.

ప్రధాని మోదీ మణిపూర్ పర్యటన ఎందుకు ముఖ్యమైనది?
2023లో జరిగిన అల్లర్ల తర్వాత ఆయన మొదటిసారి రాష్ట్రాన్ని సందర్శించడం వల్ల ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

మణిపూర్ అల్లర్లలో ఎన్ని మంది ప్రాణాలు కోల్పోయారు?
సుమారు 250 మంది మరణించారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/manchu-manoj-hero-expresses-happiness-over-films-success/cinema/546652/

Google News in Telugu Latest News in Telugu Manipur violence Modi 8500 Crore Projects Modi Manipur Visit Modi Mizoram Tour Modi Northeast Projects Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.