నార్వే చెస్ ఛాంపియన్‌షిప్ 2025లో మెరుపు ప్రదర్శనతో విజేతగా నిలిచిన గుకేష్ దొమ్మరాజుపై దేశమంతా ప్రశంసల వర్షం కురిపిస్తోంది. తెలుగు తేజం ఈ ఘనతను సాధించడంతో సోషల్ మీడియా మొత్తం గుకేష్ పేరుతో మార్మోగిపోతోంది.గుకేష్ విజయాన్ని స్వాగతిస్తూ ప్రధాని నరేంద్రమోదీ (Prime Minister Narendra Modi) ఇది గుకేష్ ప్రతిభకు నిదర్శనం అంటూ ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. మాగ్నస్ కార్ల్సెన్‌ను ఓడించడం సాధారణ విషయం కాదని పేర్కొంటూ, ఇది దేశానికి గర్వకారణం అన్నారు. గుకేష్‌కు భవిష్యత్తులో మరిన్ని విజయాలు దక్కాలన్నది ప్రధాని ఆకాంక్ష.ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) కూడా గుకేష్‌ను అభినందించారు. ప్రపంచ చెస్ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్సెన్‌పై గెలిచిన గుకేష్ విజయం, తెలుగు ప్రతిభను ప్రపంచానికి చూపించిందన్నారు. ఈ ఘనత తెలుగు యువతకు స్పూర్తిదాయకం అని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతిభావంతుల ఆటగాళ్లకు పూర్తి మద్దతు ఉండబోతోందని హామీ ఇచ్చారు.
గుకేష్ ఎవరు? – తెలుగు మూలాల యువ గ్రాండ్‌మాస్టర్
గుకేష్ దొమ్మరాజు, 2006 మే 29న తమిళనాడులోని చెన్నైలో జన్మించాడు. కానీ ఆయన తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాకు చెందినవారు. తండ్రి డాక్టర్ రజనీకాంత్ సర్జన్, తల్లి పద్మ మైక్రోబయాలజిస్టు.గుకేష్ తన ఏడో ఏటిలోనే చెస్ ఆడడం ప్రారంభించాడు. చదువు చెన్నైలోని మేల్ అయనంబాక్కంలోని వేలమ్మాళ్ స్కూల్లో పూర్తయ్యింది. చిన్న వయసులోనే అంతర్జాతీయ స్థాయిలో తన ప్రతిభ చూపించిన గుకేష్, ఇప్పుడు ప్రపంచ క్రీడారంగంలో భారత ప్రతిభకు నిదర్శనంగా నిలిచాడు.
Read Also : RCB Final Celebration : ఫైనల్ చేరిన ఆనందంలో ఆటగాళ్ల గ్రాండ్ బర్త్‌డే సెలబ్రేట్