Pongal gift scheme 2026: అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు మేలు చేకూర్చే దిశగా ఈసారి పొంగల్ పండుగకు ప్రత్యేక కానుక(Pongal gift)ను ప్రకటించింది. ఎన్నికల ముందు వచ్చే పండుగ కావడంతో గతంతో పోలిస్తే ఈసారి పొంగల్ గిఫ్ట్ పథకాన్ని మరింత విస్తృతంగా అమలు చేయనున్నారు.
Read Also: Sambalpur: హోంగార్డు పోస్టులకు 8 వేల మందికి పైగా హాజరు…

2026 పొంగల్ గిఫ్ట్ స్కీమ్‌లో భాగంగా అర్హత కలిగిన ప్రతి రేషన్ కార్డు కుటుంబానికి రూ.3,000 నగదు సహాయం తో పాటు నిత్యావసరాలు మరియు ఒక ధోతీ, చీరను అందించనున్నారు. ఈ పథకాన్ని జనవరి రెండో వారంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(MK Stalin) అధికారికంగా ప్రారంభించనున్నట్లు సమాచారం.

పంపిణీ ప్రక్రియను సక్రమంగా నిర్వహించేందుకు జనవరి మొదటి వారంలో రేషన్ షాపుల సిబ్బంది లబ్ధిదారుల(Beneficiaries) ఇళ్లకు వెళ్లి టోకెన్లు పంపిణీ చేస్తారు. టోకెన్‌లో పేర్కొన్న తేదీ, సమయానికి రేషన్ షాప్‌కు వెళ్లిన వారికి పొంగల్ కానుక అందజేస్తారు.
పొంగల్ గిఫ్ట్ లో ఏముంటాయంటే..
ఈ పొంగల్ గిఫ్ట్ హ్యాంపర్‌లో ఒక కిలో బియ్యం, ఒక కిలో చక్కెర, ఒక పొడవైన చెరుకు గడ, ధోతీ, చీర, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, యాలకులు తో పాటు రూ.3,000 నగదు ఉంటాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: