Latest News: Missing Girl: బాబోయ్..కేరళ నుంచి ఢిల్లీకి మైనర్ బాలిక విమానప్రయాణం

Read Time:  1 min
Malaysia plane missing
Malaysia plane missing
FONT SIZE
GET APP

కేరళ (Kerala) లోని విమానాశ్రయ భద్రతపై ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. 13 ఏళ్ల ఒక బాలిక ఏ విధమైన పర్యవేక్షణ లేకుండా ఒంటరిగా విమానంలో ఢిల్లీ చేరింది. గురువారం సాయంత్రం, ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (Indira Gandhi International Airport) లో అధికారులు ఈ బాలికను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

Uttar Pradesh: వ్యక్తి కడుపులో నుంచి బయటపడ్డ 29 స్పూన్లు, 19 టూత్‌బ్రష్‌లు

ఈ ఘటనపై కేరళ పోలీసులు, విమానాశ్రయ అధికారులు తక్షణమే దర్యాప్తు ప్రారంభించారు.వివరాల్లోకి వెళితే, తిరువనంతపురం (Thiruvananthapuram) పరిధిలోని విజింజం ప్రాంతంలో నివసిస్తున్న వలస బెంగాలీ దంపతుల కుమార్తె అయిన ఈ బాలిక, గురువారం ఉదయం 7 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి కనిపించకుండా పోయింది.

తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు

దీంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా, ఓ ఆటో డ్రైవర్ బాలికను విమానాశ్రయం వద్ద దించినట్లు కీలక సమాచారం అందింది.దీంతో వెంటనే ఎయిర్‌పోర్టు (Airport) అధికారులను సంప్రదించగా, ఆమె ఢిల్లీకి విమానంలో వెళ్లినట్లు ధ్రువీకరించుకున్నారు. ఈ సమాచారంతో తిరువనంతపురం నగర పోలీస్ కమిషనర్ వెంటనే ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులను అప్రమత్తం చేశారు.

Missing Girl
Missing Girl

దీంతో విమానం దిగిన వెంటనే అధికారులు బాలికను తమ అదుపులోకి తీసుకున్నారు.అయితే, మైనర్ అయిన బాలిక సొంతంగా విమాన టికెట్ ఎలా కొనుగోలు చేసింది? ప్రయాణానికి ఎవరైనా సహాయం చేశారా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. “ఒక మైనర్ బాలిక ఒంటరిగా చెక్-ఇన్, బోర్డింగ్ ప్రక్రియ (Check-in, boarding process) లను పూర్తి చేసుకుని మరో రాష్ట్రానికి ఎలా ప్రయాణించగలిగిందనే విషయంపై మేం సమగ్ర దర్యాప్తు చేస్తున్నాం” అని తిరువనంతపురంలోని ఓ సీనియర్ పోలీస్ అధికారి మీడియాకు తెలిపారు.

నిబంధనల పర్యవేక్షణలో లోపం జరిగిందా? అనే కోణంలో కూడా విచారణ

మైనర్లు ఒంటరిగా ప్రయాణించేటప్పుడు పాటించాల్సిన నిబంధనల పర్యవేక్షణలో లోపం జరిగిందా? అనే కోణంలో కూడా విచారణ జరుగుతోంది.కాగా, న్యాయపరమైన ప్రక్రియలను పూర్తి చేసి బాలికను సురక్షితంగా వెనక్కి తీసుకురావడానికి కేరళ పోలీసులు ఒక ప్రత్యేక బృందాన్ని ఢిల్లీకి పంపారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.