📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Telugu News: Missiles: భారత్ యూకే ల మధ్య రక్షణ ఒప్పందం

Author Icon By Sushmitha
Updated: October 10, 2025 • 5:48 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారతదేశ రక్షణ రంగంలో మరో ముఖ్యమైన పురోగతి చోటుచేసుకుంది. భారత్-యూకే మధ్య పరస్పర సహకారంలో భాగంగా కీలకమైన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం, యూకే తేలికపాటి, బహుళ ప్రయోజనకర మిస్సైల్(Missiles) సిస్టమ్ అయిన మార్ట్‌లెట్‌’ (Martlet Missiles) లను భారత సైన్యానికి సరఫరా చేసేందుకు అంగీకరించింది. ఈ క్షిపణులు భారత రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయనున్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

Read Also: Stock Market: లాభాలతో ముగిసిన మార్కెట్లు..

మార్ట్‌లెట్ క్షిపణుల ప్రత్యేకతలు

ఐర్లాండ్‌లోని బెల్‌ఫాస్క్‌కు చెందిన థేల్స్ ఎయిర్ డిఫెన్స్ అనే రక్షణ రంగ కంపెనీ ఈ మార్ట్‌లెట్ మిస్సైల్స్‌ను అభివృద్ధి చేసింది. ఈ క్షిపణులు తేలికపాటి, బహుళ ప్రయోజనకరమైన ఆయుధాలుగా పనిచేస్తాయి. ఇవి ఎయిర్-టు-ఎయిర్, సర్ఫేస్-టు-సర్ఫేస్, ఎయిర్-టు-సర్ఫేస్, మరియు సర్ఫేస్-టు-ఎయిర్ వ్యవస్థలుగా పనిచేసే సామర్థ్యం కలిగి ఉన్నాయి. మార్ట్‌లెట్ క్షిపణులను డ్రోన్‌లు, సాయుధ వాహనాలను కూడా ఛేదించేలా తయారుచేశారు.

లేజర్ గైడెన్స్, వినియోగం

ఈ మిస్సైల్స్ లేజర్ బీమ్ గైడెన్స్ ఆధారంగా రూపొందించబడ్డాయి. వీటిని సైనికులు తమ భుజంపై ఉంచి కూడా ప్రయోగించే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా, వీటిని సాయుధ వాహనాలు, హెలికాప్టర్లు, నౌకల నుంచి కూడా ప్రయోగించవచ్చు. ఈ క్షిపణి 6 కిలోమీటర్ల పరిధిలో శత్రువుల నుంచి వచ్చే భూ, గగనతల ముప్పును సమర్థంగా ఛేదించగలదు. ఇది 13 కిలోల బరువు కలిగి, ధ్వని వేగం కన్నా ఒకటిన్నర రెట్లు వేగంగా దూసుకెళ్లగలదు. బ్రిటన్ సైన్యంలో 2019 నుంచి వినియోగిస్తున్న ఈ క్షిపణులను ప్రస్తుతం ఉక్రెయిన్ కూడా రష్యాపై వాడుతోంది.

భారత నౌకదళంతో రోల్స్ రాయిస్ భాగస్వామ్యం

ఇదిలా ఉండగా, బ్రిటన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ రోల్స్ రాయిస్ కూడా భారత నౌకదళంతో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది. నౌకాదళం అభివృద్ధి చేస్తున్న దేశీయ మొదటి ఎలక్ట్రిక్ యుద్ధ నౌక డిజైనింగ్‌లో పాలుపంచుకోవడానికి రోల్స్ రాయిస్ సిద్ధమవుతోంది. ఈ ఎలక్ట్రిక్ యుద్ధ నౌకలో హైబ్రిడ్ ఎలక్ట్రిక్‌తో పాటు పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టమ్స్ అందించేందుకు రోల్స్ రాయిస్ భాగస్వామ్యం కానున్నట్లు సమాచారం.

భారత సైన్యానికి యూకే ఏ క్షిపణి వ్యవస్థను సరఫరా చేయనుంది?

యూకే తేలికపాటి, బహుళ ప్రయోజనకర మిస్సైల్ సిస్టమ్ అయిన ‘మార్ట్‌లెట్’ను సరఫరా చేయనుంది.

మార్ట్‌లెట్ క్షిపణి పరిధి ఎంత?

ఈ క్షిపణి 6 కిలోమీటర్ల పరిధిలో శత్రు ముప్పును ఛేదించగలదు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

DRDO Google News in Telugu India-UK defense deal Indian Navy Latest News in Telugu Martlet Missiles missile technology. Rolls Royce Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.