📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Miss World 2025 : పోటీల నుంచి వైదొలిగిన మిస్ వరల్డ్ రియాక్షన్

Author Icon By Sudheer
Updated: May 24, 2025 • 10:57 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్‌(India)లో జరుగుతున్న మిస్ వరల్డ్ (Miss World) పోటీల్లోని కీలక పరిణామంగా మిస్ ఇంగ్లాండ్-2025 మిల్లా మాగీ (Milla Magee) పోటీల నుంచి ఆకస్మికంగా వైదొలిగారు. ఆమె నిర్ణయాన్ని చర్చించుకుంటున్న నేపథ్యంలో, దీనిపై తప్పుడు ప్రచారం జరుగుతోందని మిస్ వరల్డ్ సంస్థ అధికారికంగా స్పందించింది. మిల్లా ఆరోపణలపై సంస్థ ఛైర్‌పర్సన్ జూలియా మోర్లే క్లారిటీ ఇచ్చారు. బ్రిటిష్ మీడియాలో వస్తున్న కథనాలు పూర్తిగా నిరాధారమని, ఆమె పోటీల నుంచి తప్పుకోవడానికి కారణం ఆమె కుటుంబ ఆరోగ్య పరిస్థితి మాత్రమేనని వివరించారు.

ఆరోగ్య సమస్యలే కారణం – మిస్ వరల్డ్ స్పష్టం

మిల్లా మాగీ తన తల్లి ఆరోగ్యానికి సంబంధించిన అత్యవసర పరిస్థితి కారణంగా పోటీల నుంచి తప్పుకోవాలని కోరారని, మిస్ వరల్డ్ సంస్థ వెంటనే ఆ నిర్ణయాన్ని గౌరవించి ఆమెను ఇంగ్లాండ్‌కు పంపించినట్లు జూలియా మోర్లే తెలిపారు. “మిల్లా కుటుంబ క్షేమమే మాకు ముఖ్యమైనది. ఆమె భావోద్వేగాలను మేం గౌరవించాం,” అని మోర్లే పేర్కొన్నారు. ఇది వ్యవస్థపై ఆరోపణలకు చోటివ్వదని, కొన్ని మీడియా సంస్థలు అసత్య ప్రచారం చేస్తున్నాయని ఆమె ఖండించారు.

షార్లెట్ గ్రాంట్ ప్రాతినిధ్యం – తప్పుడు కథనాలను ఖండించిన మోర్లే

మిల్లా స్థానంలో మిస్ ఇంగ్లాండ్ పోటీల తొలి రన్నరప్ అయిన షార్లెట్ గ్రాంట్ మిస్ వరల్డ్ పోటీల్లో ఇంగ్లాండ్ తరపున పాల్గొంటున్నారని సంస్థ తెలిపింది. ఆమె ఇప్పటికే భారత్‌ చేరుకుని పోటీల్లో పాల్గొంటోందని మోర్లే వెల్లడించారు. అలాగే, మిల్లా మాగీ ప్రారంభ వేడుకలో ఎంతో ఉత్సాహంగా మాట్లాడిన ఎడిట్ చేయని వీడియోలు కూడా విడుదల చేశామని పేర్కొన్నారు. ఈ వీడియోల ద్వారా ఆమె అనుభవాన్ని ఎంతో సంతోషంగా, గౌరవంగా పొందినట్లు స్పష్టమవుతుందని జూలియా మోర్లే వివరించారు.

Read Also : Covid: భారత్ లో పెరుగుతున్న కోవిడ్ కేసులు

milla magee miss world 2025 Pageant 'Outdated' and 'Exploitative' UK Contestant Milla Magee

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.