📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Misinformation : ఆయుధ వ్యాపారం కోసం నడిచే సమాచార యుద్ధం

Author Icon By Divya Vani M
Updated: May 12, 2025 • 8:10 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇందులో ఎఫ్-16, ఎఫ్-15, ఎఫ్-18, ఎఫ్-35లు పోటీ పడుతున్నాయి.ఇప్పుడు అసలు సంగతిలోకి వస్తే — 2019లో బాలాకోట్ దాడి తర్వాత పాక్ ఎఫ్-16 కూలిందని వార్తలొచ్చాయి.కానీ ఏ అథెంటిక్ రిపోర్ట్ లేదు.ఇప్పుడు మరోసారి రాఫెల్‌ విమానం కూలిందని ప్రచారం మొదలైంది. అమెరికన్‌ మీడియా సంస్థ సీఎన్‌ఎన్‌ ఈ కథనాన్ని ప్రచురించింది.కానీ ఈ కథనానికి ఆధారం ఒక తప్పుడు ఇండియన్ వెబ్‌సైట్.అది మిరాజ్‌ విమానం జారవిడిచిన ఫ్యూయల్ ట్యాంక్‌ శకలాల్ని రాఫెల్ శకలాలుగా చూపించింది.దీన్ని ఆధారంగా తీసుకుని సీఎన్‌ఎన్‌ కథనం రాసింది.ఇదంతా యాదృచ్ఛికంగా జరిగిందా? అసలు కాదు అన్న అనుమానాలే ఎక్కువ.ఎందుకంటే అంతర్జాతీయ ఆయుధ వ్యాపారంలో రాఫెల్‌, ఎఫ్-16 మధ్య పోటీ తీవ్రమైంది.ఇలాంటి సమయంలో రాఫెల్‌ మీద నెగెటివ్ వార్తలొస్తే, లాభం ఎఫ్-16 తయారీదారులకు — అంటే లాక్‌హీడ్ మార్టిన్‌కు.ఇదే తరహాలో పాకిస్తాన్‌ ఎఫ్-16ల్ని సరిహద్దు నుంచి దూరంగా తరలించింది. కారణం? భారత్‌ వద్ద ఉన్న ఎస్‌-400 వ్యవస్థ.పాక్‌ ఎఫ్-16ల్ని భారత్‌పై వాడకూడదని అమెరికా ఒప్పందంలో చెప్పింది. కానీ పాక్‌కు ఒప్పందాలు ఎంతవరకు పట్టించుకుంటుందో మనకూ తెలుసు.

ఇక చైనా, పాక్‌ కలిసి తమ జేఎఫ్‌-17, జే-10 విమానాలను ప్రమోట్ చేయడానికి ప్రచారం మొదలుపెట్టాయి.భారత యుద్ధ విమానాలను వీటితో కూల్చేశామంటూ వార్తలు వస్తున్నాయి. దీని వెనక చైనా చెంగ్దు కార్పొరేషన్ వ్యూహమే ఉంది.అసలు ఇది ఒక రకంగా ఆయుధ వ్యాపారం కోసం నడిచే సమాచార యుద్ధం.అయితే యుద్ధాల్లోనూ వేరే స్థాయి కుట్రలు జరుగుతాయి.ఒకే దేశానికి చెందిన కంపెనీలు కూడా ఒకదానిపై ఒకటి నెగెటివ్ ప్రచారం చేస్తాయి. అమెరికాలో లాక్‌హీడ్‌, బోయింగ్‌ మధ్య పోటీ ఒక ఎత్తు. కోప్ ఇండియా 2004లో ఎఫ్-15లు ఓడిపోయాయని కథనాలు వచ్చాయి. కానీ దాని వెనక ఎఫ్-22 అమ్ముకోవాలన్న వ్యూహమే ఉంది అని తర్వాత బహిర్గతమైంది.యుద్ధం జరిగితే వార్తల కంటే దాని వెనక కుట్రలే ఎక్కువ. ఆయుధ కంపెనీలకు తమ వ్యాపారమే ముఖ్యం. నిజం చెప్పాలనే నైతికత వారికి అవసరం ఉండదు. అందుకే సమాచార యుద్ధం ఇంకా ప్రమాదకరం.

Read Also : Mawra Hocane : ఆపరేషన్ సిందూర్ పై వ్యతిరేక కామెంట్స్ చేసిన మవ్రా హోకేన్

Defense contracts competition F-16 Pakistan controversy Fighter jets comparison India defense news Military propaganda warfare Rafale crash news Rafale vs F-16

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.