సాధారణంగా పోలీసులు అంటే చాలా మందిలో భయం ఉంటుంది. కానీ ఈ కథ మాత్రం అందుకు భిన్నం. ఢిల్లీకి చెందిన సబ్జీమండి ప్రాంతంలో పనిచేసిన ఎస్‌హెచ్‌ఓ మిశ్రా గారు స్థానికుల ప్రేమను విశేషంగా సంపాదించుకున్నారు. ఆయన కఠిన నిబద్ధత, ప్రామాణికత, ప్రజలకు అందుబాటులో ఉండే తీరు ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోవడానికి కారణమయ్యాయి.
బదిలీ వార్తతో కన్నీటి వీడ్కోలు
మిశ్రా బదిలీ వార్త తెలిసిన వెంటనే స్థానికులలో తీవ్ర భావోద్వేగం చెలరేగింది. నార్త్ ఢిల్లీలోని సబ్జీమండి పోలీస్ స్టేషన్ లో ఎస్ హెచ్వోగా విధులు నిర్వహిస్తున్న మిశ్రాకు ఇటీవల బదిలీ అయింది. దీంతో స్టేషన్ లోని సిబ్బందికి వీడ్కోలు పలికి వీధిలోకి రాగానే జనం ఆయనను చుట్టుముట్టారు. ఇక్కడే ఉండాలని, బదిలీపై వెళ్లొద్దని అడ్డుకున్నారు. కొందరైతే మిశ్రాను కౌగిలించుకుని ఏడ్చారు. అసలు ఓ పోలీస్ అధికారి వెళ్తుంటే సాధారణ జనం ఎందుకు ఇంతలా బాధపడుతున్నారంటే. ఆయన అక్కడ సర్వీస్‌లో ఉన్నన్ని రోజులు స్థానిక ప్రజలందరిలో మమేకంగా మెలిగేవారు. అక్కడి ప్రజలకు ఎలాంటి కష్టాలు వచ్చినా అండగా ఉండేవారట అందుకే వాళ్లు ఇంతలా బాధపడుతున్నది. తమకోసం 24 గంటలూ పనిచేసే మంచి పోలీస్ అని, ఆయన బదిలీని రద్దు చేయాలని మీడియా ద్వారా ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. మిశ్రా తన సేవలతో సబ్జీమండి ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు.
సోషల్ మీడియాలో వైరల్
ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మిశ్రా గారితో తీసుకున్న ఫొటోలు, వీడియోలు ట్రెండ్ అవుతున్నాయి. నెటిజన్లు కూడా పోలీసులపై ప్రేమ కలిగించే ఈ ఘటనను ప్రశంసిస్తున్నారు.
Read also: India missile: మరిన్ని ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్ కొనే యోచనలో భారత్?