📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

పార్లమెంట్‌ ముందు ఆర్థిక స‌ర్వేను ప్ర‌వేశ‌పెట్టిన మంత్రి నిర్మలా

Author Icon By sumalatha chinthakayala
Updated: January 31, 2025 • 3:12 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

న్యూఢిల్లీ: బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా 2024-25 ఆర్థిక సర్వే ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. పార్లమెంట్‌ ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం పూర్తయిన తర్వాత, ఆమె ఆర్థిక సర్వేను సభ ముందు ఉంచారు. అనంతరం స్పీకర్‌ ఓం బిర్లా సభను శనివారానికి వాయిదా వేశారు. రేపు (ఫిబ్రవరి 1న) కేంద్ర బడ్జెట్‌ను నిర్మలా సీతారామన్ సభకు సమర్పించనున్నారు.

కేంద్ర బడ్జెట్‌ సమర్పణకు ముందు ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టడం ఆనవాయితీగా కొనసాగుతోంది. గత ఏడాది దేశ ఆర్థిక వ్యవస్థ ప్రగతి, భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను అంచనా వేయడానికి ఈ ఎకనమిక్‌ సర్వే ఉపయోగపడుతుంది. ఆర్థిక మంత్రిత్వశాఖకు చెందిన ఎకనామిక్‌ అఫైర్స్‌ డిపార్ట్‌మెంట్‌లోని ఎకనమిక్‌ డివిజన్‌ ఈ సర్వేను రూపొందిస్తుంది. 1950-51 నుంచి ఆర్థిక సర్వేను బడ్జెట్‌తో పాటు ప్రవేశపెట్టేవారు. అయితే, 1960 తర్వాత బడ్జెట్‌కు ఒక రోజు ముందుగా ప్రవేశపెట్టే సంప్రదాయం ప్రారంభమైంది. ఈరోజు నుంచి ఫిబ్రవరి 13 వరకు మొద‌టి విడ‌త బ‌డ్జెట్ స‌మావేశాలు… మార్చి 10 నుంచి ఏప్రిల్ 4వరకు రెండో విడత బడ్జెట్‌ సెషన్స్‌ జరగనున్నాయి.

ఎకానమిక్ సర్వే అంటే ఏమిటి?..

భారత ఆర్థిక వ్యవస్థ పనితీరు, ప్రభుత్వ పాలసీలు, వచ్చే ఆర్థిక సంవత్సరం ఎలా ఉండబోతుందని అని ఆర్థిక సర్వే వివరిస్తుంది. ఇది రెండు భాగాలుగా ఉంటుంది. పార్ట్-ఏ దేశ ఆర్థిక పనితీరును విశ్లేషిస్తుంది. స్థూల ఆర్థిక సూచికలు, ఆర్థిక ధోరణులను ప్రతిబింబిస్తుంది. పార్ట్ – బీ లో విద్య, వాతావరణ మార్పు, డీజీపీ వృద్ధి, ద్రవ్యోల్బణం వంటి సామాజిక ఆర్థిక విషయాలను వివరిస్తుంది.

Economic Survey Economic Survey 2024-25 Parliament Session Union Finance Minister Nirmala Sitharaman

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.