కెనరా బ్యాంక్ (Canara Bank) తమ ఖాతాదారుల కు శుభవార్తను ప్రకటించింది. సేవింగ్స్ ఖాతాలు, శాలరీ ఖాతాలు మరియు NRI ఖాతాలపై ఉన్న మినిమం బ్యాలెన్స్ (Minimum balance) ఛార్జీలను ఇకపై రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం నేటి నుండి ( జూన్ 1 నుంచి )అమల్లోకి వచ్చిందని బ్యాంక్ స్పష్టం చేసింది. ఇది దేశవ్యాప్తంగా లక్షలాది ఖాతాదారులకు ఉపశమనం కలిగించే పరిణామంగా భావించవచ్చు.
ఇప్పటి వరకు ఉన్న మినిమం బ్యాలెన్స్ నిబంధనలు
ఇంతవరకు కెనరా బ్యాంక్ ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ ఉండేలా ఖాతాదారులను కోరేది. అర్బన్ బ్రాంచుల్లో కనీసం రూ. 2,000, సెమీ అర్బన్ బ్రాంచుల్లో రూ. 1,000 మరియు గ్రామీణ ప్రాంతాల్లో రూ. 500 బ్యాలెన్స్ ఉండాల్సిన నిబంధన ఉండేది. ఈ మినిమం బ్యాలెన్స్ లేదంటే, ఖాతాదారులు పీనాల్టీ చెల్లించాల్సి వచ్చేది. ఇది చాలామందికి భారం కావడంతో బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది.
ఖాతాదారులకు ప్రయోజనాలు
ఈ మార్పుతో ఖాతాదారులు ఇకపై తమ ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ నిబంధనల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా తక్కువ ఆదాయ గలవారికి ఇది ఎంతో ఉపయుక్తం. తక్షణం నుంచి ఇది అమల్లోకి వస్తుండటంతో కొత్త ఖాతాదారులకు కూడా ఇది ఆకర్షణగా మారుతుంది. ఈ చర్య ద్వారా కెనరా బ్యాంక్ మరింత వినియోగదారులకు చేరువయ్యే అవకాశముంది.
Read Also : Rain: తెలంగాణలో వచ్చే ఐదు రోజులుపాటు వర్షాలు