📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం

వలసదారులపై కేంద్రం ఉక్కుపాదం..

Author Icon By Anusha
Updated: February 8, 2025 • 6:03 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినప్పటినుంచి
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారు. ఇందులో భాగంగా గత కొన్నేళ్లుగా అక్రమంగా వలసవెళ్లిన భారతీయుల్ని గుర్తించి తిరిగి వెనక్కి పంపేస్తున్నారు. అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపాలన్న నిర్ణయం మేరకు వీరిని మిలటరీ విమానాల్లో ఎక్కించి మరీ భారత్ కు పార్శిల్ చేసేస్తున్నారు. పార్లమెంట్ లోనూ రచ్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం చెప్పిన ఓ పాయింట్ ఇప్పుడు ఇలా భారత్ కు తిరిగొస్తున్న వలసదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది.లక్షలు తగలేసి అమెరికాకు అక్రమ మార్గాల్లో వెళ్లి సెటిల్ అవుదామనుకుంటే అక్కడ ట్రంప్ ఉరుముతున్నాడు. ట్రంప్ చేతికి చిక్కి భారత్ కు తిరిగొస్తున్న వారికి ఇక్కడి ప్రభుత్వం షాకిస్తోంది. ఇప్పటికే అమెరికాకు ఇలా అక్రమ మార్గాల్లో వెళ్లిన వారి వివరాలను సేకరిస్తోంది. తాజాగా అమెరికా నుంచి తిరిగి వచ్చిన వారి సాయంతో ఇలా ఇంకెంత మంది వెళ్లారో తెలుసుకునేందుకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రయత్నం చేస్తోంది. ఇప్పటివరకూ ఓ నాలుగు వేల మంది లెక్క తేలగా.. మిగిలిన వారిని గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

బైడెన్ ప్రభుత్వం ఉన్నప్పుడు అమెరికాకు భారత్ నుంచి వలస వెళ్లిన 4300 మందిని ఈడీ గుర్తించినట్లు తెలుస్తోంది. గుజరాత్, పంజాబ్ కేంద్రంగా ఉన్న ఏజెంట్ల సాయంతో వీరు అమెరికాకు అక్రమ మార్గాల్లో వెళ్లినట్లు సమాచారం. అలాగే వీరంతా భారతీయుల్ని అమెరికాకు పంపడానికి అక్రమ మార్గాలను రూపొందించినట్లు కనుగొన్నారు. ఇలా వీరు చేసిన 4,000కు పైగా అనుమానాస్పద లావాదేవీలను గుర్తించారు. అలాగే వీరు భారతీయుల్ని అమెరికాతో పాటు చట్ట విరుద్దంగా కెనడాకూ పంపినట్లు గుర్తించారు. దీంతో వీరిని అరెస్టు చేసి ప్రశ్నించేందుకు ఈడీ సిద్దమవుతోంది.ప్రస్తుతం వలసదారుల సమస్య దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కేంద్ర ప్రభుత్వం వలసదారులపై కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ నిర్ణయాల కారణంగా వలసదారులు మరింత కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేస్తూ, వలసదారుల చట్టాలను మరింత కఠినతరం చేసింది.ఈ కొత్త విధానాల ప్రభావం వలసదారుల జీవితాలపై ఎంతగానో చూపనుంది. న్యాయపరంగా, సామాజికంగా, ఆర్థికంగా వలసదారులకు ఈ నిర్ణయాలు తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది. కొన్ని వర్గాలు దీనిని మానవ హక్కుల ఉల్లంఘనగా చూస్తుంటే, మరికొందరు దేశ భద్రతకు అవసరమైన చర్యగా సమర్థిస్తున్నారు.ఈ మార్పుల వెనుక అసలు కారణాలేంటో, ప్రభావిత వర్గాల పరిస్థితి ఎలా మారనుందో, భవిష్యత్తులో వలసదారుల హక్కులు ఎలా ప్రభావితమవుతాయో తెలుసుకోవాలంటే, తాజా సమాచారం కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి.

#BreakingNews #కేంద్రప్రభుత్వం #ప్రభుత్వనియమాలు #వలసకథనం #వలసదారులు Breaking News in Telugu Google News in Telugu indian government Latest News in Telugu modi Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today Newsg trump USA

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.