📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Middle East Conflict: ఖమేనీ మరణంపై భారత్ మౌనం? కారణం ఏంటి!

Author Icon By Aanusha
Updated: March 3, 2026 • 12:07 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Middle East Conflict: ఇరాన్ సుప్రీం నేత ఆయతుల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ప్రపంచ దేశాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ మరణంపై భారత ప్రభుత్వం ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. అయితే, ఈ దాడిని ఖండిస్తూ కేంద్రం వెంటనే ప్రకటన విడుదల చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇది రాజకీయాంగా పెను చర్చకు దారితీసింది.ప్రధాని మోదీ యంత్రాంగం.. బదులుగా సంయమనం పాటించాలని, ఉద్రిక్తతలను తగ్గించాలని పిలుపునిచ్చింది.

Read Also: Majid Ebnelreza appointment : యుద్ధ వేళ ఇరాన్ నిర్ణయం, తాత్కాలిక రక్షణ మంత్రిగా మాజిద్

అంతర్జాతీయ స్థాయిలో మిశ్రమ స్పందన

వైఖరి అనేక ప్రధాన ప్రపంచ శక్తుల ప్రతిస్పందనను ప్రతిబింబిస్తుందని అధికార వర్గాలు తెలిపాయి.భారత్ మాత్రం స్పందించకపోవడానికి గతంలోనే ఆయన కశ్మీర్ గురించి చేసి వ్యాఖ్యలే కారణమని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. 2017 నుంచి 2024 మధ్య నాలుగుసార్లు భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నారని, ఇరాన్ రాయబారులకు ప్రతిసారి న్యూఢిల్లీ సమన్లు పంపిందని తెలిపాయి. 2017 లో పాకిస్థాన్‌కు వంతపాడుతూ అణచివేతకు గురైన కశ్మీరీల కోసం ముస్లింలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఆర్టికల్ 370 రద్దు సమయంలోనూ.. 2021 ఢిల్లీ అల్లర్లు, సెప్టెంబరు 2024లో పౌరసత్వ సవరణ చట్టంపై ఎక్స్ (ట్విట్టర్)లో భారత్‌కు వ్యతిరేకంగా పోస్ట్‌లు పెట్టారు.

Middle East Conflict: India’s silence on Khamenei’s death? What is the reason!

‘‘ఉన్మాద హిందువులు ముస్లింలను ఊచకోత కోస్తున్నారు.. భారత్‌లో ముస్లింల ఉనికి ప్రమాదం ఉంది’’ అంటూ విషం గక్కారు.మరోవైపు, అమెరికా అణు ఒప్పంద చర్చల సందర్భంగా ఎల్ఎన్జీ ఒప్పందంపై టెహ్రాన్ బెదిరింపులకు పాల్పడినా 2005, 2006, 2009లో అంతర్జాతీయ అణు శక్తి సంస్థ ( IAEA) తీర్మానంపై ఇరాన్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకత్వంలోని అప్పటి యూపీఏ ప్రభుత్వం ఓటేసిందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు గుర్తుచేస్తున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Ayatollah Khamenei India Iran Relations International Reaction on Iran Modi Govt on Iran Israel Opposition on Khamenei

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.