ప్రపంచ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్‌తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ దావోస్‌లో సమావేశమయ్యారు. ఈ భేటీ మైక్రోసాఫ్ట్ కేఫ్‌లో ప్రొమెనేడ్ వద్ద జరిగింది. చర్చలలో ఐటీ అభివృద్ధి, వైద్య రంగంలో పురోగతి, అలాగే రాష్ట్రంలో కొత్త ఆవిష్కరణలకు సంబంధించి పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో తమపై నమ్మకంతో మైక్రోసాఫ్ట్ ఐటీ కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడం వల్ల అక్కడి రూపురేఖలు ఎలా మారిపోయాయో బిల్ గేట్స్‌కు గుర్తుచేశారు. అలాగే, ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న ఏపీ కోసం మరింత సహాయం అందించాలని కోరారు.
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా లోకేశ్ బిల్ గేట్స్‌తో పలు ప్రతిపాదనలు చేశారు.
- ఏఐ యూనివర్సిటీ: ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయబోయే వరల్డ్ క్లాస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ సలహా మండలిలో బిల్ గేట్స్ భాగస్వామ్యం వహించాలని కోరారు.
- హెల్త్ ఇన్నోవేషన్: రాష్ట్రంలో హెల్త్ ఇన్నోవేషన్ అండ్ డయాగ్నోస్టిక్స్ కేంద్రాలను బిలిండా గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు.
- ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్: ఆఫ్రికాలో హెల్త్ డ్యాష్‌బోర్డ్‌ల మాదిరిగా సామాజిక వ్యవస్థాపకత కోసం ఏపీలో ఫౌండేషన్ నైపుణ్యాన్ని వినియోగించాలని కోరారు.
- గేట్వే హబ్: దక్షిణ భారతంలో బిలిండా గేట్స్ ఫౌండేషన్ కార్యకలాపాలకు ఏపీని గేట్వేగా నిలిపేందుకు సహాయం చేయాలని సూచించారు.
బిల్ గేట్స్ చంద్రబాబును దావోస్‌లో కలవడం పట్ల తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.ఆయనను విజనరీ లీడర్‌గా అభివర్ణిస్తూ, “చాలా కాలం తర్వాత చంద్రబాబును కలవడం ఎంతో ఆనందంగా ఉంది. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలు ఆకర్షణీయంగా ఉన్నాయి.మేం వాటిపై మా సహచరులతో చర్చించి తగిన నిర్ణయాలు తీసుకుంటాము,”అని తెలిపారు.ఈ సమావేశం రాష్ట్ర అభివృద్ధి దిశగా జరిగిన ఒక కీలకమైన చర్చగా నిలిచింది.చంద్రబాబు, లోకేశ్ పటిష్టమైన ప్రతిపాదనల ద్వారా బిల్ గేట్స్‌ను ఆకట్టుకోవడం రాష్ట్రానికి పెద్ద మైలురాయిగా చెప్పుకోవచ్చు.