📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Microsoft: భారీగా లేఆఫ్ ను ప్రకటించిన మైక్రోసాఫ్ట్!

Author Icon By Vanipushpa
Updated: July 10, 2025 • 4:33 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్(Microsoft) తన కార్యకలాపాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)(AI) వినియోగాన్ని పెంచుతూ భారీగా లబ్ధి పొందుతోంది. మరోవైపు, ఇదే సమయంలో వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తూ విమర్శల పాలవుతోంది. ఏఐ ఉపయోగం ద్వారా ఒక్క ఏడాదిలోనే సుమారు రూ. 4,285 కోట్లు ఆదా చేసుకున్నామని ప్రకటించిన ఆ సంస్థ, అదే సమయంలో 9,100 మంది ఉద్యోగులను తొలగించడం గమనార్హం. మైక్రోసాఫ్ట్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ జడ్సన్ ఆల్తోఫ్ వెల్లడించిన వివరాల ప్రకారం, గత సంవత్సర కాలంలో కంపెనీకి ఏఐ వినియోగం ద్వారా 500 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 4,285 కోట్లు) ఆదా(Save) అయ్యాయి. ముఖ్యంగా కాల్ సెంటర్ కార్యకలాపాల్లో ఏఐని వాడటం వల్ల ఖర్చు తగ్గడమే కాకుండా, కస్టమర్ల(Customers)కు మెరుగైన సేవలు అందుతున్నాయని ఆయన తెలిపారు.

Microsoft: భారీగా లేఆఫ్ ను ప్రకటించిన మైక్రోసాఫ్ట్!

అయితే, ఈ ఆదా ప్రకటన వెనుకనే 9,100 మంది ఉద్యోగుల తొలగింపు వార్త ఉంది. ఇది కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 4 శాతం. ఎక్స్‌బాక్స్‌, గేమింగ్ డివిజన్‌లకు చెందిన ఉద్యోగులపై ఈ లేఆఫ్‌ల ప్రభావం ఎక్కువగా పడింది. కంపెనీ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మైక్రోసాఫ్ట్ అధికారికంగా ప్రకటించింది. ఈ ఏడాదిలో మైక్రోసాఫ్ట్ ఉద్యోగాల కోత విధించడం ఇది నాలుగోసారి కావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ లేఆఫ్‌ల నేపథ్యంలో, ఉద్యోగాలు కోల్పోయిన వారికి మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్ ఒకరు ఇచ్చిన సలహా తీవ్ర వివాదాస్పదమైంది. ఎక్స్‌బాక్స్ గేమ్‌ స్టూడియోస్‌కు చెందిన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మాట్ టర్నబుల్, “ఈ కష్టకాలంలో మానసిక బాధ నుంచి ఉపశమనం పొందేందుకు, రెజ్యూమెలు మెరుగుపరుచుకునేందుకు ఏఐ టూల్స్ వాడుకోవచ్చు” అని తన లింక్డ్‌ఇన్ పోస్టులో సూచించారు .

మైక్రోసాఫ్ట్ అంటే ఇంగ్లీషులో ఏమంటారు?
మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ అనేది ఒక అమెరికన్ బహుళజాతి సాంకేతిక సంస్థ, ఇది 1975లో స్థాపించబడినప్పటి నుండి కంప్యూటర్ పరిశ్రమలో కీలక పాత్ర పోషిస్తోంది. వాషింగ్టన్‌లోని రెడ్‌మండ్‌లో ప్రధాన కార్యాలయం ఉంది.

మైక్రోసాఫ్ట్ CEO ఎవరు?
సత్య నాదెళ్ల (4 ఫిబ్రవరి 2014–)
మైక్రోసాఫ్ట్ / CEO
మైక్రోసాఫ్ట్ CEO ఎవరు అనే చిత్రం?
సత్య నాదెళ్ల - మూలం
సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ ఛైర్మన్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్.
మైక్రోసాఫ్ట్ చరిత్ర ఏమిటి?
మైక్రోసాఫ్ట్ ఒక అమెరికన్ బహుళజాతి కంప్యూటర్ టెక్నాలజీ కార్పొరేషన్, దీని చరిత్ర ఏప్రిల్ 4, 1975న ప్రారంభమైంది. హార్వర్డ్ కళాశాల నుండి మానేసిన బిల్ గేట్స్ మరియు అతని బాల్య స్నేహితుడు పాల్ అలెన్ స్థాపించిన మైక్రోసాఫ్ట్ ఇప్పుడు అతిపెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీగా మారింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:Elon Musk: ట్రంప్, ఎలాన్ మస్క్ మధ్య మళ్లీ భగ్గుమన్న విభేదాలు

#telugu News Latest News Breaking News Microsoft employees fired Microsoft job cuts Microsoft layoffs Microsoft restructuring Microsoft workforce reduction tech industry layoffs tech layoffs 2025

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.