📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Michael Vaughan: ఐసీసీ నిబంధనలపై మైఖేల్ వాన్ తీవ్ర విమర్శలు!

Author Icon By Anusha
Updated: July 25, 2025 • 4:57 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో రిషబ్‌ పంత్‌ ప్రదర్శన, ఆయన గాయం గురించి మైఖేల్ వాన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం క్రికెట్‌ (Cricket) ప్రపంచంలో చర్చనీయాంశంగా మారాయి. రిషబ్‌ పంత్‌ గాయపడ్డప్పటికీ తన సమర్థతను ప్రదర్శిస్తూ అద్భుతమైన అర్ధ సెంచరీ చేయడం, అతనికి మద్దతుగా వాన్ వ్యాఖ్యానించడం, క్రికెట్ నిబంధనలపై విమర్శించడం కీలకంగా నిలిచాయి.ఈ టెస్టులో పంత్‌ కాలి వేలికి గాయమైనా ధైర్యంగా బరిలో నిలిచాడు. 37 పరుగుల వద్ద రెండోరోజు ఇన్నింగ్స్‌ను కొనసాగించిన పంత్‌ చివరకు 54 పరుగులు చేశాడు. 75 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో రిషబ్‌ పంత్ (Rishabh Pant) చేసిన ఆ అర్ధ సెంచరీ గాయాన్ని తలచుకుంటే సాధారణ విషయం కాదు. గాయం తర్వాత కూడా 28 బంతులు ఆడుతూ 17 పరుగులు సాధించడం ఒక సాహసోపేతమైన ప్రదర్శనగా చెప్పవచ్చు.

బ్యాటింగ్ లేదా బౌలింగ్‌కు అనుమతి ఇవ్వడం

ఈ నేపథ్యంలో ప్రముఖ బ్రిటిష్ వార్తా సంస్థ ‘ది టెలిగ్రాఫ్’కు రాసిన కాలమ్‌లో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ (Michael Vaughan) స్పందిస్తూ, టెస్టుల్లో గాయపడిన ఆటగాళ్లకు ప్రత్యామ్నాయంగా పూర్తిస్థాయి బాట్స్‌మెన్ లేదా బౌలర్‌ను కచ్చితంగా అనుమతించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం క్రికెట్‌లో గాయపడిన ప్లేయర్‌కి ఫీల్డింగ్ చేసే ఓ సబ్‌స్టిట్యూట్‌ను మాత్రమే అనుమతిస్తున్నారు. కానీ బ్యాటింగ్ లేదా బౌలింగ్‌కు అనుమతి ఇవ్వడం లేదని, ఇది అన్యాయం అని వాన్ అన్నారు.పంత్‌ ఉదాహరణను చూపిస్తూ వాన్ చెప్పారు,ఏంటంటే, పంత్‌ బ్యాటింగ్‌ చేసేందుకు పూర్తిగా ఫిట్‌గా లేడని, పరుగెత్తలేకపోయాడని గుర్తు చేశాడు. దాంతో గాయం మరింత తీవ్రతరమయ్యేదని పేర్కొన్నారు. ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అతను (పంత్‌) వికెట్‌ కీపర్‌గా ప్రత్యామ్నాయంగా ఆడేందుకు అనుమతి ఇచ్చారని కానీ బ్యాటింగ్‌, బౌలింగ్‌ చేయడానికి అనుమతి ఇవ్వలేదని ఇది కొంచెం వింతగా ఉందన్నారు.

Michael Vaughan: ఐసీసీ నిబంధనలపై మైఖేల్ వాన్ తీవ్ర విమర్శలు!

డాక్టర్‌ ధ్రువీకరించే గాయాలైన సందర్భంలో

ఇలా జరిగే ఏకైక ఆట క్రికెట్‌ మాత్రమేనని క్రికెట్‌ ఇప్పటికీ చీకటి యుగంలో ఉందని తాను భావిస్తున్నానని మాజీ కెప్టెన్‌ పేర్కొన్నారు.పాత నియమాల వల్ల మ్యాచ్‌ నాలుగు రోజులు ఓ జట్టు పది మంది ఆటగాళ్లతోనే ఆడాల్సి ఉంటుందని, కాబట్టి ఆ ప్రభావాన్ని ఉద్దేశపూర్వకంగా తగ్గిస్తుందని పేర్కొన్నారు. ఒక ఆటగాడు వెన్నుగాయం, కండరాల ఒత్తిడితో బాధపడితే ఆడలేడని, స్కానింగ్‌, డాక్టర్‌ ధ్రువీకరించే గాయాలైన సందర్భంలో ప్రత్యామ్నాయంగా మరో ఆటగాడిని తీసుకునే సౌలభ్యంగా ఉండాలన్నారు. వాస్తవానికి క్రికెట్‌లో గతంలో బై రన్నర్‌కు అవకాశం ఉండేది. కానీ, ఈ రూల్‌ (rule) ను దుర్వినియోగం చేస్తున్నారంటూ ఐసీసీ 2011 అక్టోబర్ 1న రద్దు చేసింది. అయితే, కంకషన్ సబ్‌స్టిట్యూషన్‌కు మాత్రం ఐసీసీ అవకాశం ఇచ్చింది. కంకషన్ సబ్‌స్టిట్యూట్ రూల్ ప్రకారం,ఆటగాడి తలకు తీవ్ర గాయమైతే అతని స్థానంతో మరో ఆటగాడిని ఆడించేందుకు అవకాశం ఉంటుంది.

ధోని లేక రిషబ్ పంత్‌ ఎవరు గొప్పవారు?

ధోని, పంత్ ఇద్దరూ గొప్ప క్రికెటర్లు కానీ విభిన్న శైలిలో రాణించిన ఆటగాళ్లు.

రిషబ్ పంత్ యొక్క ఆటతీరు ఏమిటి?

అతను ఎడమచేతి బ్యాట్స్‌మన్, వికెట్ కీపర్. టెస్ట్ క్రికెట్‌లో ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేస్తూ మ్యాచ్‌ను తిరగరాస్తాడు.

Breaking News india vs england 4th test latest news michael vaughan on cricket rules pant brave innings rishabh pant half century Rishabh Pant Injury rishabh pant performance Telugu News test cricket rules debate

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.