MGNREGA: ఉపాధి హామీ పథకానికి సంబంధించిన కీలక మార్పులకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఆమోదం తెలిపింది. పథకం పేరును పూర్తిగా మార్చుతూ, ఇప్పటి వరకు కొనసాగుతున్న ‘మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(Mahatma Gandhi National Rural Employment Guarantee Scheme)’కు బదులుగా ‘పూజ్య బాపు గ్రామీణ రోజ్‌గార్ యోజన’గా పునర్‌నామకరణం చేసింది. ఈ నిర్ణయానికి కేంద్ర కేబినెట్ ఆమోదం లభించింది.
Read Also : Reliance: కూతురు ఈషా కోసం మెగా IPOకి ప్లాన్ చేస్తున్న ముఖేష్ అంబానీ
గ్రామీణ ఉపాధి పథకానికి 1.51 లక్షల కోట్లు
ఇక పనిదినాల్లో కూడా పెద్ద మార్పు చేశారు. ప్రస్తుతం ఉన్న 100 రోజుల పనిదినాలను 125 రోజులుగా విస్తరించారు. గ్రామీణ కార్మికులకు ఇచ్చే రోజువారీ వేతనాన్ని కూడా పెంచుతూ రూ.240కి పెంచాలని నిర్ణయించారు. పథకాన్ని మరింత బలపర్చడానికి కేంద్రం రూ.1.51 లక్షల కోట్ల భారీ బడ్జెట్ కేటాయించింది.
2005లో ప్రారంభమైన ఈ ఉపాధి పథకం యూపీఎ ప్రభుత్వం కాలంలో అమల్లోకి వచ్చింది. తర్వాత దీనికి మహాత్మా గాంధీ పేరు జతచేశారు. గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధి భద్రతను పెంపొందించేందుకు, నైపుణ్యం లేని కార్మికులకు సంవత్సరానికి కనీసం 100 రోజుల పని హామీ ఇవ్వడం ఈ పథకం లక్ష్యం. ఇప్పుడు పనిదినాల పెంపుతో గ్రామీణ కుటుంబాలకు మరింత ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ప్రభుత్వం చేసిన తాజా మార్పులతో గ్రామీణ ఉపాధిలో నాణ్యత, స్థిరత్వం పెరుగుతుందని అధికారులు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: