📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు

Latest Telugu News: Meta: భారత్‌లో మెటా అండర్‌సీ కేబుల్ ప్రాజెక్ట్‌ ప్రారంభం

Author Icon By Vanipushpa
Updated: October 10, 2025 • 1:59 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారతదేశ ఆర్థిక వ్యవస్థ బలహీనమైందని పేర్కొన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇప్పుడు వాస్తవాన్ని గుర్తించాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే ప్రపంచంలోని అతిపెద్ద టెక్ కంపెనీలు ఆపిల్, గూగుల్, మెటా (Meta Platforms Inc.) భారతదేశంలో భారీ పెట్టుబడులు పెడుతూ దేశ ఆర్థిక శక్తిని ముందుకు తీసుకువెళ్లేందుకు రెడీ అయ్యాయి. తాజాగా మెటా భారతదేశంలో తన ‘వాటర్‌వర్త్’ (Waterworth) అనే అండర్‌సీ కేబుల్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించ బోతోంది. ఇది కేవలం టెక్నాలజీ ప్రాజెక్ట్ మాత్రమే కాదు, భారతదేశాన్ని గ్లోబల్ డేటా నెట్‌వర్క్‌లలో కీలక కేంద్రంగా నిలబెట్టే మైలురాయి అవుతుందని చెప్పవచ్చు. ఈ ప్రాజెక్ట్‌ కోసం మెటా భారతీయ ఐటీ కంపెనీ సిఫీ టెక్నాలజీస్ ను తన ల్యాండింగ్ పార్ట్నర్ గా ఎంపిక చేసింది. దీని విలువ సుమారు 5 మిలియన్ డాలర్లు (రూ. 44 కోట్లు). ఈ కేబుల్ ప్రాజెక్ట్‌కి ముంబై, విశాఖపట్నం ల్యాండింగ్ పాయింట్లుగా నిర్ణయించబడ్డాయి. సిఫీ ఇప్పటికే గూగుల్‌ యొక్క ‘బ్లూ-రామన్’ (Blue-Raman) సబ్‌సీ కేబుల్ ప్రాజెక్ట్‌లో భాగస్వామిగా ఉన్నందున, ఈ కొత్త ఒప్పందం భారతదేశం గ్లోబల్ డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో వేగంగా ఎదుగుతోందని సూచిస్తోంది.
అతిపెద్ద ప్రాజెక్ట్‌గా మారనున్నది.

Jaish-e-Mohammed: జైషే మహమ్మద్ కు చదువుకున్న మహిళలే టార్గెట్

భారత్‌లో మెటా అండర్‌సీ కేబుల్ ప్రాజెక్ట్‌ ప్రారంభం

ఓపెన్‌కేబుల్స్ ఇంక్ వ్యవస్థాపకుడు సునీల్ ఠాగరే ప్రకారం.. మెటా కేబుల్ వ్యవస్థ రాబోయే 5 నుండి 10 సంవత్సరాల్లో దాదాపు 10 బిలియన్ డాలర్ల పెట్టుబడిని కలిగి ఉంటుంది. కేబుల్ వేయడానికే 2 బిలియన్ డాలర్లు, సెకనుకు 1 పెటాబిట్ (Pbps) సామర్థ్యం గల పరికరాలపై మరో 2 బిలియన్ డాలర్లు.. అలాగే భారతదేశంలో AI డేటా సెంటర్లు నిర్మించడానికో లేదా లీజుకు ఇవ్వడానికో కనీసం 6 బిలియన్ డాలర్లు ఖర్చు చేయనుంది. ఇది భారతదేశంలో మెటా పెట్టుబడుల పరంగా ఇప్పటివరకు అతిపెద్ద ప్రాజెక్ట్‌గా నిలుస్తుంది.

సుంకాలపై వెనక్కి తగ్గిన ట్రంప్

భారత ఫార్మారంగానికి భారీ ఊరట.. సుంకాలపై వెనక్కి తగ్గిన ట్రంప్
‘వాటర్‌వర్త్’ ప్రపంచంలోనే అతి పొడవైన జలాంతర్గామి కేబుల్ వ్యవస్థ. దాదాపు 50 వేల కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఇది అమెరికా, భారతదేశం, బ్రెజిల్, దక్షిణాఫ్రికా దేశాలను కలుపుతుంది. కేబుల్ మార్గం ప్రత్యేకంగా “W” ఆకారంలో రూపొందించబడింది, ఎందుకంటే ఇది ప్రమాదకరమైన ఎర్ర సముద్రం మార్గాన్ని తప్పించుకోవడంలో సహాయపడుతుంది. గతంలో ఆ ప్రాంతంలో హౌతీ మిలిటెంట్ల దాడుల కారణంగా కొన్ని కేబుల్‌లు దెబ్బతిన్నాయి. వాటర్‌వర్త్ కేబుల్ 2029 నాటికి పూర్తి స్థాయిలో వేయబడుతుందని అంచనా వేస్తున్నారు.

వేగవంతమైన డేటా ట్రాన్స్‌ఫర్

ఈ ప్రాజెక్ట్ భారతదేశానికి ఒక గేమ్-ఛేంజర్ కావచ్చని సునీల్ ఠాగరే పేర్కొన్నారు. దీని ద్వారా భారతదేశం.. ప్రపంచ AI మౌలిక సదుపాయాల కేంద్రంగా ఎదగగలదు. మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు భారతదేశంలో తమ డేటా సెంటర్ క్లస్టర్లుని వేగంగా విస్తరిస్తున్నాయి. ఈ కేబుల్ వల్ల భారతీయ వినియోగదారులకు వేగవంతమైన డేటా ట్రాన్స్‌ఫర్, తక్కువ లేటెన్సీ,మెరుగైన కనెక్టివిటీ లభిస్తుంది. భారతదేశంలో డేటా స్థానికీకరణ (Data Localization) చట్టాలు కఠినతరం అవుతున్న నేపథ్యంలో, మెటా తన డేటా భారతదేశంలోనే నిల్వ చేసే విధానంపై దృష్టి పెడుతోంది. దీని వల్ల దేశీయ సర్వర్ నెట్‌వర్క్‌లు, క్లౌడ్ సేవలు, AI మోడల్ ట్రైనింగ్ సామర్థ్యాలు మరింత బలపడతాయని అంచనా వేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Digital India high-speed internet India India digital infrastructure Meta connectivity project Meta undersea cable submarine internet cable Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.