కర్ణాటక (Karnataka) రాష్ట్రం మహిళల సంక్షేమానికి సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఇటీవల క్యాబినెట్ (Karnataka Cabinet) సమావేశంలో మహిళలకు నెలసరి రోజున వేతనంతో కూడిన సెలవును ఇవ్వడానికి ఆమోదం ప్రకటించబడింది. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా మహిళల హక్కుల పరిరక్షణ, వారి ఆరోగ్యాన్ని ప్రాధాన్యతగా భావిస్తూ తీసుకోబడినట్లు భావించవచ్చు.
Taliban: భారత్ పర్యటనలో తాలిబన్ మంత్రి.. అధికారులకు కొత్త చిక్కులు
ఇప్పటికే ఒడిశా, బిహార్ వంటి రాష్ట్రాల్లో మహిళలకు నెలసరి సెలవులు (Monthly holidays) అమలులో ఉన్నాయి. కర్ణాటక ఇప్పుడు ఆ జాబితాలో చేరడం, రాష్ట్రంలో మహిళా ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్న అధికారాన్ని ప్రదర్శిస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, గార్మెంట్ ఫ్యాక్టరీలు, బహుళజాతి సంస్థలు, ఐటీ సహా ఇతర ప్రయివేట్ సంస్థల్లో పనిచేసే మహిళలకు ఒకరోజు నెలసరి సెలవు (Menstrual Leave) తప్పనిసరి అని కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం పేర్కొంది.మహిళల ఆరోగ్యం, శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని, ఒక సహకార, సమగ్ర పనివాతావరణాన్ని ప్రోత్సహించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.
మహిళా ఉద్యోగుల ఆరోగ్యం, శ్రేయస్సు
‘మహిళా ఉద్యోగుల ఆరోగ్యం, శ్రేయస్సు దృష్ట్యా, మరింత సహాయకంగా, సమగ్రంగా ఉండే పని వాతావరణాన్ని ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ కార్యక్రమం మహిళా ఉద్యోగులలో నెలసరి (Menstrual Leave) ఆరోగ్యంపై అవగాహన పెంచడమే కాకుండా, వారి శారీరక, మానసిక సౌకర్యాన్ని కూడా నిర్ధారించడమే లక్ష్యంగా పెట్టుకుంది’ అని క్యాబినెట్ నోట్‌లో స్పష్టం చేసింది.
ఈ నిర్ణయం పనిచేసే మహిళలకు ఎంతగానో ప్రయోజనం చేకూర్చుతుందని కర్ణాటక రాష్ట్ర న్యాయశాఖ మంత్రి హెచ్‌కే పాటిల్ (Law Minister HK Patil) అన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఈ విధానం విజయవంతమైందని, కర్ణాటకలోనూ దీనిని అమలు చేయాలని నిర్ణయించామని క్యాబినెట్ సమావేశం అనంతరం మీడియాతో అన్నారు.

మహిళలకు 3 రోజుల నెలసరి సెలవులు
గతేడాది ఆగస్టులో ఒడిశా ప్రభుత్వం (Odisha Govt) ఉద్యోగినులకు వేతనంతో కూడిన నెలసరి సెలవు విధానం అమల్లోకి తెచ్చింది.కాగా, మహిళలకు 3 రోజుల నెలసరి సెలవులు ఇవ్వాలంటూ 2022లో ఓ బిల్లును పార్లమెంట్ తీసుకొచ్చినప్పటికీ అది ఆమోదం పొందలేదు.
సుప్రీంకోర్టు (Supreme Court) కూడా ప్రభుత్వ, ప్రయివేట్ సంస్థల్లో పనిచేసే మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవులు ఇవ్వాలని సూచించింది. ఈ సెలవుల వల్ల మరింత ఎక్కువ మంది మహిళలు ఉద్యోగాల్లో చేరేలా ప్రోత్సహించినట్లు అవుతుందని అభిప్రాయపడింది.
ప్రభుత్వ ఉద్యోగినులకు రెండు రోజుల
ఇక, 1992 నుంచే బిహార్ (Bihar) ప్రభుత్వ ఉద్యోగినులకు రెండు రోజుల నెలసరి సెలవు విధానం అమలు చేస్తోంది.కేరళ (Kerala) లోనూ విద్యార్థినులకు 3 రోజుల నెలసరి సెలవు అమల్లో ఉంది. అలాగే, దేశంలోని పలు యూనివర్సిటీలు కూడా తమ విద్యాలయాల్లో చదువుకునే విద్యార్థినులకు నెలసరి సెలవులు ప్రకటించాయి.
ఇదిలా ఉండగా, మహిళలకు నెలసరి సెలవును 2023లో కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న స్మృతి ఇరానీ వ్యతిరేకించడం గమనార్హం. ఇది వైకల్యం కాదని, సహజ ప్రక్రియ అన్న ఆమె.. సెలవు వల్ల పనిప్రదేశంలో మహిళల వివక్షకు గురికావచ్చిన అభిప్రాయపడ్డారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: